Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రొ కబడ్డీ లీగ్ మొత్తానికి అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే

Pro Kabaddi League 2018: Most expensive buys from players auction

హైదరాబాద్: ఇప్పటికే సుస్థిరమైపోయి ఉన్న ఐపీఎల్, ఐఎస్ఎల్‌ల స్థానంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళుతోంది ప్రొ కబడ్డీ. ఇదే క్రమంలో చూస్తుండగానే ప్రొ కబడ్డీ సీజన్-6 కూడా వచ్చేసింది. దీనికి సంబంధించి ముంబై వేదికగా జరిగిన తొలి రోజు వేలంలో.. ఆటగాళ్ల రేట్లు అంచనాలు తారుమారు చేశాయి. 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు ఇప్పటికే 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురిని రిటెయిన్‌ చేసుకోవచ్చు.

వేలం గురువారం కూడా కొనసాగనుంది. ఈ సీజన్‌ వేలంలో మొత్తం 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా... ఇందులో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, కొరియా, మలేసియా, శ్రీలంక తదితర దేశాల ఆటగాళ్లు. ఈసారి కొత్తగా ఫ్యూచర్‌ కబడ్డీ హీరోస్‌ (ఎఫ్‌కేహెచ్‌) వేలంలోకి వచ్చారు.

PKL

పీకేఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేయొచ్చు. జట్టులో కనిష్టంగా 18 మంది, గరిష్టంగా 25 మందికి మించకుండా ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.

మోను గోయత్‌ - రూ.1.51 కోట్లు

మోను గోయత్‌ - రూ.1.51 కోట్లు

మోను గోయత్ రైడర్‌గా ఓ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ మోను అందరి కంటే ఖరీదైన ఆటగాడిగా పేరొందాడు. గతేడాది పట్నా పైరేట్స్ జట్టు తరపున ఆడిన గోయత్‌ను ఈ ఏడాది హర్యానా స్టీలర్స్ జట్టు కొనుగోలు చేసింది.

రాహుల్‌ చౌదరి - రూ.1.28 కోట్లు

రాహుల్‌ చౌదరి - రూ.1.28 కోట్లు

హర్యానా ఆటగాడు రాహుల్ చౌదరి తొలి రోజు వేలంలో అధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ రైడర్‌ను తెలుగు టైటాన్స్ జట్టు రూ.1.28 కోట్లు ఇచ్చి అట్టి పెట్టుకుంది.

నితిన్‌ తోమర్‌ - రూ.1.15 కోట్లు

నితిన్‌ తోమర్‌ - రూ.1.15 కోట్లు

రైడర్ నితిన్ తోమర్ గతేడాది లీగ్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రూ.93 లక్షలకు యూపీ యోధా జట్టుకు సొంతమైయ్యాడు. అయితే జట్టులో మార్పు చోటు చేసుకుని పుణెరి పల్టాన్ ఇతణ్ని రూ.1.15 కోట్లకు కొనుగోలు చేసింది.

దీపక్‌ నివాస్‌ హుడా - రూ.1.15 కోట్లు

దీపక్‌ నివాస్‌ హుడా - రూ.1.15 కోట్లు

పుణెరి పల్టాన్ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ నివాస్ హుడాను అతణ్ని జట్టు అంటిపెట్టుకోలేదు. దీంతో ఈ ఆల్‌రౌండర్‌ను వేలానికి వదిలేయడంతో పట్నా పైరేట్స్ రూ.1.15 కోట్లకు కొనుగోలు చేసింది.

రిషాంక్‌ దేవడిగ - రూ.1.11 కోట్లు

రిషాంక్‌ దేవడిగ - రూ.1.11 కోట్లు

కూతకెళ్తే పాయింట్ పట్టినట్లే.. ఈ రైడర్ అలాంటి యోధుడైన రిషాంక్ దేవాడిగాను యూపీ యోధా రూ.1.11కోట్లకు కొనుగోలు చేసింది.

ఫజెల్‌ అత్రాచలి - రూ.1 కోటి

ఫజెల్‌ అత్రాచలి - రూ.1 కోటి

ఫజెల్‌ అత్రాచలి ప్రొ కబడ్డీ వేలంలో కోటి రూపాయలు పలికిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని ప్రారంభ ధర రూ.20లక్షల నుంచి క్రమంగా పెరుగుతూ రావడంతో యూ ముంబా రూ. కోటి ఇచ్చి సొంతం చేసుకుంది. కాగా, ఇప్పటి వరకూ అంటి పెట్టుకున్న ఆటగాళ్లను మినహాయిస్తే వేలంలో అధిక ధర పలికిన ఆటగాళ్లలో ఫజెల్ అత్రాచలి టాప్ 1 స్థానంలో ఉన్నాడు.

Story first published: Friday, June 1, 2018, 18:06 [IST]
Other articles published on Jun 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+