ప్రో కబడ్డీ లీగ్: ముగిసిన వేలం, రికార్డు ధర పలికిన ఆటగాళ్లు వీరే (ఫోటోలు)
హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ వేలం ముగిసింది. పీకేఎల్ ఐదో సీజన్ కోసం 12 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దీంతో రికార్డు స్థాయిలో ఆటగాళ్లు ధర పలికారు. సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో జరిగిన వేలం పాటలో ఆటగాళ్ల కొనుగోలును పూర్తి చేశాయి. 12 ఫ్రాంచైజీలు 227 మంది ఆటగాళ్ల కోసం రూ. 47 కోట్లు వెచ్చించాయి.
రెండో రోజు నిర్వహించిన వేలంలో సూరజ్ దేశాయ్ (రూ. 52.50 లక్షలు) అత్యధిక ధర పలికాడు. అతని కోసం దబంగ్ ఢిల్లీ అరకోటికి పైగా ఖర్చుచేసింది. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ.4 కోట్లు ఆటగాళ్ల కోసం ఖర్చు చేయాల్సి ఉండగా.. అన్ని జట్లు చాలా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశాయి.
యు ముంబా అత్యధికంగా రూ.3.98 కోట్లు ఖర్చు చేసింది. పునేరి పల్టాన్ అత్యల్పంగా రూ.3.8 కోట్లు వెచ్చించింది. క్రికెట్ లెజెంజ్ సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్న తమిళనాడు అత్యధికంగా 25 మంది క్రీడాకారులను వేలంలో దక్కించుకుంది. ఇందులో 21 మంది దేశవాళీ ఆటగాళ్లు కాగా, నలుగురు విదేశీయులు.
అత్యల్పంగా పునేరి 15 మందిని కొనుగోలు చేసింది. ఇక రూ.3.96 కోట్లు ఖర్చు చేసిన తెలుగు టైటాన్స్.. వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈసారి జాగ్రత్తగా ఆటగాళ్ళను ఎంపిక చేసుకుంది. రాహుల్ చౌదరిని అట్టిపెట్టుకున్న టైటాన్స్ మొత్తంగా 18 మందిని వేలంలో కొనుగోలు చేసింది.
అందులో పది మంది రైడర్లు, ఐదుగురు డిఫెండర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. తొలి రోజు 'ఎ' కేటగిరీ ఆటగాళ్లు అమ్ముడుపోగా మంగళవారం నాటి వేలంలో బి, సి, డి కేటగిరీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల వశమయ్యారు. గత సీజన్ల ప్రతిభ ఆధారంగా తొలిరోజు లక్షలు పోసిన ఫ్రాంచైజీలు... రెండో రోజు సమతూకం పాటించాయి.
స్టార్ రైడర్ నితిన్ తోమర్ బేస్ ప్రైస్ రూ. 20 లక్షలు. తొలిరోజే ఉత్తరప్రదేశ్ ఫ్రాంచైజీ అతన్ని రూ. 93 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. పీకేఎల్ చరిత్రలో ఇదే కొత్త రికార్డు. పీకేఎల్ ఐదో సీజన్ జూలై 28 నుంచి అక్టోబరు 25 వరకు జరుగుతుంది. 3 నెలల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 130కి పైగా మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రో కబడ్డీ లీగ్ 2017 జట్లు ఇలా:

తెలుగు టైటాన్స్
ఆటగాళ్ల సంఖ్య: 18
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,96,70,000
ఖరీదైన ఆటగాళ్లు: రాహుల్ చౌదరి (రూ.53.90 లక్షలు-అట్టిపెట్టుకున్న ఆటగాడు), నీలేష్ (రూ.49 లక్షలు), రాకేశ్ (రూ.45 లక్షలు), వినోద్ (రూ.44.50 లక్షలు), ఫర్హాద్ (రూ.29 లక్షలు)

యు ముంబా
ఆటగాళ్ల సంఖ్య: 18
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,98,65,000
ఖరీదైన ఆటగాళ్లు: అనూప్‌కుమార్ (రూ.56.65 లక్షలు-అట్టిపెట్టుకున్న ఆటగాడు), కుల్‌దీప్‌సింగ్ (రూ.51.50 లక్షలు), కాశీలింగ్ (రూ.48 లక్షలు), షాబీర్ బప్పు (రూ.45 లక్షలు)

బెంగళూరు బుల్స్
ఆటగాళ్ళ సంఖ్య: 18
ఖర్చు చేసిన మొత్తం: రూ. 3,93,90,000
ఖరీదైన ఆటగాళ్లు: రోహిత్ (రూ.81 లక్షలు), ఆశిష్ (రూ.50.60 లక్షలు), రవీందర్ (రూ.50 లక్షలు), అజయ్ (రూ.48.50 లక్షలు), సచిన్ కుమార్ (రూ.46 లక్షలు)

బెంగాల్ వారియర్స్
ఆటగాళ్ళ సంఖ్య: 18
ఖర్చు చేసిన మొత్తం: రూ. 3,96,70,000
ఖరీదైన ఆటగాళ్లు: జాంగ్ కున్ లీ (రూ.80.30 లక్షలు-అట్టిపెట్టుకున్న ఆటగాడు), సుర్జీత్‌సింగ్ (రూ.73 లక్షలు), రాన్ సింగ్ (రూ.47.50 లక్షలు), మణిందర్‌సింగ్ (రూ.45.50 లక్షలు), దీపక్ (రూ.25.50 లక్షలు)

దబాంగ్ ఢిల్లీ
ఆటగాళ్ళ సంఖ్య: 20
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,92,15,000
ఖరీదైన ఆటగాళ్లు: మిరాజ్ (రూ.57.75 లక్షలు-అట్టిపెట్టుకున్న ఆటగాడు), సూరజ్ (రూ.5.25 లక్షలు), బాజీరావ్ (రూ.44.50 లక్షలు), నీలేష్ (రూ.35.50 లక్షలు), రోహిత్ బలియాన్ (రూ.35 లక్షలు)

జైపూర్ పింక్ పాంథర్స్
ఆటగాళ్ళ సంఖ్య: 19
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,92,60,000
ఖరీదైన ఆటగాళ్లు: మన్‌జీత్ (రూ.75.50 లక్షలు), సెల్వమణి (రూ.73 లక్షలు), జస్వీర్ (రూ.51 లక్షలు), సోమ్‌వీర్ (రూ.40.50 లక్షలు), నవనీత్ (రూ.24 లక్షలు)

పట్నా పైరేట్స్
ఆటగాళ్ళ సంఖ్య: 18
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,83,90,000
ఖరీదైన ఆటగాళ్లు: ప్రదీప్ నర్వాల్ (రూ.55 లక్షలు- అట్టిపెట్టుకున్న ఆటగాడు), జైదీప్ (రూ.50 లక్షలు), మోను గోయత్ (రూ.44.50 లక్షలు), సచిన్ షింగాడె (రూ.42.50 లక్షలు), విశాల్ మానె (రూ.36.50 లక్షలు)

టీమ్ ఉత్తర్‌ప్రదేశ్
ఆటగాళ్ల సంఖ్య: 18
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,92,60,000
ఖరీదైన ఆటగాళ్లు: నితిన్ (రూ.93 లక్షలు), రాజేశ్(రూ.69 లక్షలు), జీవకుమార్(రూ.52 లక్షలు), రిశాంక్(రూ.45.50 లక్షలు), సురేంద్ర(రూ.28.50

టీమ్ తమిళనాడు
ఆటగాళ్ల సంఖ్య: 25
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,95,90,000
ఖరీదైన ఆటగాళ్లు: అజయ్ ఠాకూర్ (రూ.69.30 లక్షలు), అమిత్ హుడా (రూ.63 లక్షలు), అరుణ్ (రూ.33 లక్షలు), అనిల్‌కుమార్ (రూ.25.50 లక్షలు)

పునేరి పల్టాన్
ఆటగాళ్ళ సంఖ్య: 15
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,80,40,000
ఖరీదైన ఆటగాళ్లు: దీపక్ (రూ.72.60 లక్షలు- అట్టిపెట్టుకున్న ఆటగాడు), సందీప్ (రూ.66 లక్షలు), ధర్మరాజ్ (రూ.46 లక్షలు), రాజేశ్ (రూ.42 లక్షలు). గిరీశ్ (రూ.33.50 లక్షలు)

టీమ్ గుజరాత్
ఆటగాళ్ళ సంఖ్య: 18
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,89,50,000
ఖరీదైన ఆటగాళ్లు: ఫజల్ అత్రాచలి (రూ.55 లక్షలు), అబోజర్ (రూ. 50 లక్షలు), సచిన్ (రూ.36 లక్షలు), సుకేశ్ (రూ.31.50 లక్షలు), సునీల్‌కుమార్ (రూ.30.40 లక్షలు)

టీమ్ హర్యానా
ఆటగాళ్ళ సంఖ్య: 22
ఖర్చు చేసిన మొత్తం: రూ.3,86,75,000
ఖరీదైన ఆటగాళ్లు: సురేందర్ నాడా (రూ.51.15 లక్షలు), మోహిత్ చిల్లార్ (రూ.46.50 లక్షలు), వజీర్‌సింగ్ (రూ.44 లక్షలు), సీపీఓ సుర్జీత్‌సింగ్ (రూ.42.50 లక్షలు), ప్రశాంత్‌కుమార్ (రూ.21 లక్షలు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications