యూపీ ఘన విజయం: 28 రైడ్ పాయింట్లతో రిషాంక్ చరిత్ర
హైదరాబాద్: ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో యూపీ యోధా ఆటగాడు రిషాంక్ దేవడిగ చరిత్ర సృష్టించాడు. గురువారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషాంక్ ఒక్కడే 28 పాయింట్లు సాధించి యూపీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్రో కబడ్డీ లీగ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన రైడర్‌గా చరిత్ర సృష్టించాడు.

మ్యాచ్ ఆరంభం నుంచి యూపీ హవా
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి యూపీ హవానే కొనసాగింది. రిషాంక్ పాయింట్ మీద పాయింట్ కొల్లగొట్టడంతో 27-12తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన యూపీ యోధా.. చివరి వరకు అదే జోరు కొనసాగించింది.

8 పాయింట్లతో మెరిసిన తుషార్
జైపూర్ తరఫున తుషార్ పాటిల్ ఎనిమిది పాయింట్లతో రాణించినా ఆ జట్టుని ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఈ విజయంతో యూపీ యోధా జట్టు కూడా ఓ రికార్డును ఖాతాలో వేసుకుంది.

అత్యధిక పాయింట్లు సాధించిన తొలి జట్టుగా
ప్రొ కబడ్డీ లీగ్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. జోన్-బిలో జైపుర్ 21 మ్యాచ్‌ల్లో 51 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా.. యూపీ 20 మ్యాచ్‌ల నుంచి 59 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది.

ప్రొ కబడ్డీలో శుక్రవారం
పుణె Vs గుజరాత్ (రాత్రి 8గంటల నుంచి)
బెంగాల్ Vs తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటల నుంచి)
స్టార్ స్పోర్ట్స్-2లో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications