హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)-5వ సీజన్‌లో యు ముంబా రెండో మ్యాచ్‌తో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో యు ముంబా జట్టు 29-28తో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యు ముంబా జట్ట ఒక్క పాయింట్ తేడాతో నెగ్గింది.
మ్యాచ్‌లో ఎక్కువ భాగం హర్యానా ఆధిపత్యం కనబరిచినా చివరికి ముంబానే పైచేయి సాధించింది. ప్రొకబడ్డీలో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే హర్యానా జట్టులోని ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. యు ముంబా జట్టులో కశిలింగ్ (7 పాయింట్లు), అనూప్ కుమార్ (6) రాణించారు.
సురీందర్ సింగ్ 4, సురేశ్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. హర్యానా తరఫున వజీర్ సింగ్ (6), వికాస్ (6) ప్రదర్శన ఆకట్టుకుంది. సుర్జీత్ సింగ్ 4, రాకేశ్ సింగ్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి హర్యానా 15-11తో ఆధిక్యంలో నిలిచింది.
ద్వితీయార్ధం ప్రారంభంలోనూ హర్యానా ఆటగాళ్ల జోరే కొనసాగింది. ఒకానొక దశలో ముంబాని ఆలౌట్ కూడా చేసింది. దీంతో ఈ జట్టు ఒక దశలో 19-12తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. అయితే ముంబా వరుస రైడింగ్‌లతో, టాకిల్ పాయింట్లతో 29-26తో ఆధిక్యంలోకి వెళ్లింది.
రైడ్‌కు వెళ్ళిన వజీర్ 2 పాయింట్లు సాధించడంతో హర్యానా 28-29తో ముంబాకు చేరువవ్వడంతో ఆధిక్యం తారుమారైంది. 22-20తో ముంబా ఆధిపత్యం మొదలైంది. అక్కడి నుంచి జాగ్రత్తగా ఆడిన ముంబా ఆటగాళ్లు ఆధిక్యాన్ని తుదివరకు కాపాడుకుంటా విజయం సాధించారు.