For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రో కబడ్డీ లీగ్: సీజన్ 5లో టాప్ రైడర్లు వీరే (ఫోటోలు)

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్ తర్వాత భారత్‌లో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా కబడ్డీ వెలుగొందుతుంది. ప్రో కబడ్డీ పుణ్యమా అని కబడ్డీ క్రీడాకారులు ఆర్ధికంగా కూడా సెటిల్ అవుతున్నారు. గత నాలుగు సీజన్లుగా రైడర్లు తమదైన ప్రతిభతో ప్రో కబడ్డీ లీగ్‌కు క్రేజ్‌ని పెంచారు.

మరికొందరు రైడర్లు ప్రో కబడ్డీ లీగ్ ద్వారా పాపులారిటీని కూడా సంపాదించారు. తాజాగా ప్రో కబడ్డీ లీగ్‌తో వెలుగులోకి వచ్చి అభిమానులను సంపాదించుకున్న రైడర్లు ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం.

రాహుల్‌ చౌదరి (తెలుగు టైటాన్స్‌)

రాహుల్‌ చౌదరి (తెలుగు టైటాన్స్‌)

తెలుగు టైటాన్స్‌కు చెందిన రాహుల్ చౌదరి భారత కబడ్డీకి పోస్టర్‌ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫెండర్‌గా కెరీర్‌ను ఆరంభించిన రాహుల్‌ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రైడర్‌గా ఎదిగాడు. ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టుని కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో రెండుసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. 503 రెయిడ్‌ పాయింట్లతో లీగ్‌లో చరిత్ర సృష్టించాడు. కబడ్డీ వరల్డ్‌కప్‌ నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

కాశీలింగ్‌ అడ్కే (యు ముంబా)

కాశీలింగ్‌ అడ్కే (యు ముంబా)

గతంలో ఢిల్లీకి ఆడిన కాశీలింగ్‌ ప్రస్తుతం ఐదో సీజన్‌లో ముంబా తరఫున ఆడుతున్నాడు. టో టచ్‌, రన్నింగ్‌ హ్యాండ్‌ టచ్‌ ఇతడి ప్రత్యేకత. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో అడ్కే ఉన్నాడు. 2015లో జరిగిన లీగ్‌లో తెలుగు టైటాన్స్‌పై ఏకంగా 24 పాయింట్లు సాధించి రికార్డులకెక్కాడు. రెండో సీజన్‌లో బెస్ట్‌ రైడర్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు.

అజయ్‌ ఠాకూర్‌ (తమిళ్‌ తలైవాస్‌)

అజయ్‌ ఠాకూర్‌ (తమిళ్‌ తలైవాస్‌)

అజయ్‌ ఠాకూర్‌ ప్రత్యేకత వేరు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్లో ఇరాన్‌ను మట్టి కరిపించడంలో అజయ్‌ కీలకపాత్ర పోషించాడు. మొదటి రెండు సీజన్లు బెంగళూరు తరఫున ఆడిన అజయ్‌ ఆ తర్వాత పుణెకు ప్రాతినిధ్యం వహించాడు. ఐదో సీజన్‌లో సచిన్‌ టెండూల్కర్‌ టీమ్‌ తమిళ్‌ తలైవాస్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు.

అనూప్‌ కుమార్‌ (యు ముంబా)

అనూప్‌ కుమార్‌ (యు ముంబా)

మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. వ్యూహాలు రచించడంలో దిట్ట. ఐదోసారి కూడా ముంబా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అనూప్‌ కెప్టెన్సీలో ముంబా మూడుసార్లు ఫైనల్స్‌ చేరగా.. ఒకసారి టైటిల్‌ సాధించింది.

జస్వీర్‌ సింగ్‌ (జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌)

జస్వీర్‌ సింగ్‌ (జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌)

జస్వీర్‌ సింగ్‌ రైడింగే ప్రత్యేకం. స్కార్పియాన్‌ కిక్‌ ఇతడి ప్రత్యేకత. వరల్డ్‌కప్‌ నెగ్గిన జట్టులో కూడా జస్వీర్‌ సభ్యుడుగా ఉన్నాడు. రైడింగ్‌తోపాటు డిఫెన్స్‌లోనూ రాణిస్తున్నాడు. లీగ్‌లో ఎన్నో సూపర్‌ టాకిల్స్‌ చేశాడు. 51 లక్షలకు జైపూర్‌ ఇతడిని కొనుగోలు చేసింది. గత సీజన్‌లో జైపూర్‌ను ఫైనల్‌ చేర్చడంలో జస్వీర్‌ కీలకపాత్ర పోషించాడు.

మంజీత్‌ సింగ్‌ చిల్లార్‌ (జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌)

మంజీత్‌ సింగ్‌ చిల్లార్‌ (జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌)

భారత కబడ్డీ జట్టులో అతి ముఖ్యుడు. దూకుడుగా వ్యవహరిస్తూనే.. తెలివిగా ఆడడం ఇతడి ప్రత్యేకత. ఎంతో అనుభవం ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే తగిన వ్యూహాలను వెంటనే అమలు చేస్తాడు. ఇక డిఫెన్స్‌లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. థై హోల్డ్‌తోపాటు రైడర్‌ను డాష్‌ కొట్టి అవుట్‌ చేయడంలో ఇతడి స్టైలే వేరు.

పర్‌దీప్‌ నర్వాల్‌ (పట్నా పైరేట్స్‌)

పర్‌దీప్‌ నర్వాల్‌ (పట్నా పైరేట్స్‌)

లీగ్‌లో యువ ఆటగాడు పర్‌దీప్‌. రైడ్‌కు వెళ్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లే పరిగెత్తాల్సిందే. ఫలితాలను అమాంతం మార్చేస్తాడు. అతి కొద్ది కాలంలోనే రైడర్‌గా మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుత సీజన్‌లో పట్నా కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్నాడు. పర్‌దీప్‌ ‘డుబ్కీ' రైడ్‌ టెక్నిక్‌ ఎంతో పాపులర్‌.

దీపక్‌ హుడా (పుణెరి పల్టన్‌)

దీపక్‌ హుడా (పుణెరి పల్టన్‌)

తొలి రెండు లీగ్‌లు తెలుగు టైటాన్స్‌ తరఫున ఆడిన దీపక్‌ ఆ తర్వాత పుణెరి పల్టన్‌ జట్టు తరుపున ఆడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో కెప్టెన్‌గా పుణెను సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. రన్నింగ్‌ హ్యాండ్‌ టచ్‌ ఇతడి ప్రత్యేకత. ప్రత్యర్థులను తన వేగంతో ఇబ్బంది పెడతాడు. డిఫెండర్‌గా కూడా రాణిస్తున్నాడు.

రోహిత్‌ కుమార్‌ (బెంగళూరు బుల్స్‌)

రోహిత్‌ కుమార్‌ (బెంగళూరు బుల్స్‌)

ప్రో కబడ్డీ లీగ్‌లో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడు రోహిత్ కుమార్. ప్రస్తుతం ఐదో సీజన్‌లో బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సీజన్‌ 3లో మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. రోహత్‌ సారథ్యంలో బెంగళూరు బుల్స్ ఈ సీజన్‌లో ఎలాగైనా టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో ఉంది.

జంగ్‌ కున్‌ లీ (బెంగాల్‌ వారియర్స్‌)

జంగ్‌ కున్‌ లీ (బెంగాల్‌ వారియర్స్‌)

కొరియా సంచలన ఆటగాడు జంగ్‌ కున్‌ లీ. వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లీగ్‌లో అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. జూడో, తైక్వాండోలో ప్రవేశం ఉన్న లీ కబడ్డీలో ఆయా మార్షల్‌ ఆర్ట్స్‌ తాలూకూ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఉంటాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+