హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో పుణెరి పల్టన్ జోరు కొనసాగుతోంది. నాగ్‌పుర్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 26-21తో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ఫలితంగా జోన్-ఎలో పుణెరి పల్టన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
జోన్ ఎలో ప్రస్తుతం పుణెరి పల్టన్ 17 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. పుణెరి పల్టన్ ఆటగాళ్లు రాజేష్ మండల్ (8), దీపక్ హుడా (7) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దబాంగ్ ఢిల్లీకి ఆనంద్ పాటిల్ (8), సునీల్ (4) అండగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది.

తొలి అర్ధభాగంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే రెండో అర్ధ భాగంలో పుణెరి పల్టన్ అనూహ్యంగా పుంజుకొని ఆధిక్యం పెంచుకుంటూ పోయింది. పుణెరి తరఫున రాజేష్ మోండల్ 8, దీపక్ హూడా 7 పాయంట్లు చేశారు. ఢిల్లీ ఆటగాళ్లలో ఆనంద్ పాటిల్ 8, సునీల్ 4 చొప్పన పాయంట్లు సాధించారు.
ఇక, పుణె 14 రైడ్, 8 ట్యాకిల్ పాయింట్లు చేయగా దబాంగ్ 11 రైడ్, 6 ట్యాకిల్ పాయింట్లు సాధించింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్‌తో యుపి యోధా జట్లు తలపడనున్నాయి. ఈ పోటీలను 'స్టార్ స్పోర్ట్స్-2' ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.