ప్రో కబడ్డీ: హ్యాట్రిక్‌తో పట్నా చరిత్ర, ఫైనల్లో గుజరాత్‌పై విజయం
హైదరాబాద్: ప్రో కబడ్డీ ఐదో సీజన్ విజేతగా పట్నా పైరేట్స్ నిలిచింది. తద్వారా వరుసగా మూడోసారి టైటిల్ సాధించి పట్నా పైరేట్స్ చరిత్ర సృష్టించింది. ఈ 'హ్యాట్రిక్' విజయంతో పట్నా లీగ్ ఫేవరేట్‌గా మారిపోయింది. శనివారం జరిగిన పైనల్లో పట్నా కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 19 రైడ్ పాయింట్లతో అన్నీ తానై నడిపించి, మళ్లీ జట్టును గెలిపించాడు.
శనివారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పట్నా పైరేట్స్ 55-38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. 6-14తో ఆరంభంలో వెనుకబడి.. తీవ్ర ఒత్తిడిలో చిక్కుకుని.. వీళ్ల పనైపోయినట్లేనా? అనిపించిన తరుణంలో పట్నా పైరేట్స్ అద్భుతం చేసింది.
గత మూడు మ్యాచ్‌ల్లో తన రైడింగ్‌తో పట్నా విజయాల్లో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (19) ఫైనల్లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఆట ఆరంభం నుంచే గుజరాత్ తన దూకుడుని ప్రదర్శించింది. పట్నాను ఆలౌట్ చేసి 15-10తో దూసుకుపోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో పట్నా కెప్టెన్ ఐదు పాయింట్లు తెచ్చి 15-15తో స్కోర్ సమం చేశాడు.

17-16తో ఆధిక్యంలోకి వెళ్లిన పట్నా
అనంతరం గుజరాత్‌ను ఆలౌట్ చేసిన పట్నా 17-16తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నుంచి రైడింగ్, ట్యాకిలింగ్‌లో పట్నా ఆటగాళ్లు రెచ్చిపోయారు. కెప్టెన్ నర్వాల్‌తో పాటు విజయ్, జైదీప్ కూడా దూకుడుని ప్రదర్శించడంతో వరుసగా పాయింట్లను పెంచుకుంటూ పోయింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి పట్నా 21-18తో నిలిచింది.

రెండో అర్ధభాగంలో పుంజుకున్న గుజరాత్
ఇక, రెండవ అర్ధభాగంలో డిఫెండింగ్ చాంపియన్ మరింత చెలరేగి 29-23తో ఆధిక్యం కనబరిచింది. ఈ సమయంలో గుజరాత్ పుంజుకోవడంతో పట్నా ఆధిక్యాన్ని 26-30కి తగ్గించింది. ఆ తర్వాత పట్నా 45... గుజరాత్ 36. మ్యాచ్ ఇంకా 4 నిమిషాల్లో ముగియనుంది. అయితే ఈ దశలో సచిన్ (11) విజృంభించడంతో గుజరాత్ పుంజుకున్నా.. అది అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.

కీలక సమయంలో రాణించిన పట్నా కెప్టెన్ నర్వాల్
కోర్టులో కెప్టెన్ నర్వాల్‌కు జతగా ఒక్కరే మిగిలారు. వీళ్లిద్దరిని గుజరాత్ ఔట్ చేస్తే ఆలౌట్ పాయింట్లతో స్కోరు 40కి చేరుతుంది. ఈ సమయంలో రైడింగ్‌కు వెళ్లిన పట్నా కెప్టెన్ రెండు పాయింట్లు తెచ్చాడు. ఇదే సమయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న డిఫెండర్లు ప్రత్యర్థి రైడర్లను పట్టేయడంలో పొరపాట్లు చేశారు. ప్రదీప్ మరోసారి వరుస సూపర్‌రైడ్లు చేయడంతో పట్నా 50-36తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.

55-38తో గుజరాత్‌పై విజయం సాధించిన పట్నా
చివరికి 55-38తో గుజరాత్‌పై విజయం సాధించింది. పట్నాలో విజయ్ 7, జైదీప్ 5 పాయింట్లు సాధించారు. గుజరాత్‌లో సచిన్ 11, మహేంద్ర రాజ్‌పుత్ 5, చంద్రన్ రంజిత్ 4 పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నాకు ఇది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. 2016 సీజన్లో జరిగిన రెండు టోర్నీల్లోనూ పట్నా పైరేట్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications