Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి వరకు ఉత్కంఠ: పట్నా Vs యుపి మ్యాచ్ డ్రా

హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో పట్నా పైరెట్స్‌కు తొలి డ్రా ఎదురైంది. యూపీ యోధాతో ఆదివారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు చెరో పాయింట్ సాధిస్తూ చివర వరకు పోవడంతో ఆట ముగిసే సమయానికి 27-27తో సమంగా నిలిచాయి.

పట్నా ఆటగాడు ప్రదీప్‌ నర్వాల్‌ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో యూపీ 5-3, 13-10 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో ఇరు జట్ల పోటా పోటీగా పాయింట్లా సాధించాయి. ఒకానొక దశలో పట్నా 11-13, 12-15తో ప్రత్యర్థిని అందుకునే ప్రయత్నం చేసింది.

Pro Kabaddi League 2017: Patna Pirates hold UP Yoddha to a draw

యూపీ యోధాకు గెలుపు అవశాలున్నా చివర్లో వరుస తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకొంది. 31వ నిమిషం వరకు యూపీ 22-17తో ఆధిక్యంలో కొనసాగింది. ఆఖర్లో పట్నా ఆటగాడు ప్రధీప్ నర్వాల్‌ మూడు పాయింట్లు తేవడంతో పట్నా 23-26 తో పుంజుకుంది. తుది నిమిషంలో తోమర్‌ పాయింట్‌తో యూపీ 27-25తో నిలిచింది.

ఈ దశలో మరో పది సెకన్లలో ఆట ముగుస్తుందనగా నర్వాల్‌ మరో 2 పాయింట్లు సాధించడంతో పట్నా 27-27తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. పట్నా పైరెట్స్ కెప్టెన్ ప్రధీప్ 9 రైడ్‌ పాయింట్లతో చెలరేగగా. యోధాలో నితిన్‌ తోమర్‌ 7 రైడ్‌ పాయింట్లు చేశాడు.

ఇదిలా ఉంటే సోమవారం ప్రొ కబడ్డీ లీగ్‌లో మ్యాచ్‌లు జరగవు. షెడ్యూల్‌లో విశ్రాంతి దినంగా ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+