పట్నా చేతిలో చిత్తు: తెలుగు టైటాన్స్‌కు తప్పని ఓటమి
హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో పేలవమైన ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆరంభ మ్యాచ్ మినహా మరే దశలోనూ ఆకట్టుకోలేకపోతున్న టైటాన్స్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దీంతో ఆరింట్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది.
గురువారం గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43-36 స్కోరు తేడాతో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్, ప్రధాన రైడర్ మోను దెబ్బకు టైటాన్స్ విలవిల్లాడింది. టైటాన్స్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసిన పట్నా మూడు సార్లు సూపర్ ట్యాకిల్స్‌తో అదరగొట్టింది.

ఆరంభంలో ఇరుజట్లు సమంగా
ఆరంభంలో ఇరుజట్లు సమంగా కనిపించినా ఆ తర్వాత పట్నా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. టైటాన్స్‌ను ఆలౌట్ చేసి 19-15తో ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరిని లక్ష్యంగా చేసుకున్న పట్నా అతడిని రైడింగ్‌కు వచ్చిన ప్రతిసారీ అవుట్ చేసింది.

రాహుల్‌ని ఎక్కువసేపు బెంచ్‌పై కూర్చునేలా
దీంతో అతడిని వీలైనంత ఎక్కువసేపు బెంచ్‌పై కూర్చునేలా చేయడంలో విజయవంతమైంది. తొలి అర్ధభాగం ముగిసేసరికి పట్నా 23-16తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగం ఆరంభమయ్యే సమయానికి రాహుల్ 10 నిమిషాలు కోర్టు బయటే ఉన్నాడు. దీనిని అనుకూలంగా మలుచుకున్న పట్నా ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ రైడింగ్‌లో 12 పాయింట్లు సాధించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

10 పాయింట్లు స్కోరు మోను గోయత్
పట్నా తరఫున మరో ఆటగాడు మోను గోయత్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. రైడర్లు రాహుల్, నీలేష్ సాలుంకే ఘోరంగా విఫలమవడంతో టైటాన్స్‌కు పాయింట్లు రాలేదు. ఒకదశలో పట్నా 16 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. మరో 5 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రాహుల్ చౌదరి (12) ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా రైడ్ పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు.

చివర్లో విజృంభించిన రాహుల్ చౌదరి
ఒక్కసారిగా 10 రైడ్ పాయింట్లు సంపాదించాడు. రాహుల్ మినహా మరెవరూ పోరాడకపోవడంతో టైటాన్స్‌కు పాయింట్లు కరువయ్యాయి. చివర్లో పట్నా ఆలౌటైంది. చివరి 5 నిమిషాల్లో టైటాన్స్ 12 పాయింట్లు సాధించగా, పట్నా 3 పాయింట్లే సాధించింది. అయినా టైటాన్స్ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో పట్నా చేతిలో టైటాన్స్‌కు ఇది రెండో ఓటమి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications