Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దుమ్ము రేపిన పట్నా పైరెట్స్: బెంగళూరుపై భారీ విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పట్నా ఫైరెట్స్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మరో భారీ విజయం సాధించింది. కెప్టెన్ పర్దీప్‌ నర్వాల్‌ 15 రైడ్‌ పాయింట్లతో చెలరేగడంతో ఆ జట్టు బెంగళూరు బుల్స్‌ను 46-32 తేడాతో చిత్తుగా ఓడించింది.

మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ప్రదీప్ నర్వాల్ (15) రైడింగ్‌లో అదరగొట్టాడు. వరుస రైడ్‌ పాయింట్లు సాధించి ఆధిక్యం పెంచుకొంది. మోను గోయత్‌ (7), వినోద్‌ కుమార్‌ (7) పాయింట్లతో రాణించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి పైరెట్స్ 23-11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.

Pro Kabaddi League 2017: Patna Pirates defeat Bengaluru Bulls to win 46-32

రెండో అర్ధభాగంలో పట్నా పైరెట్స్ ఆటగాళ్లు చెలరేగారు. పట్నా రైడింగ్‌లో 24 పాయింట్లు నెగ్గగా, బెంగళూరు బుల్స్ 22 పాయింట్లు సాధించింది. డిఫెన్స్‌లో పట్నా ఆటగాళ్లు 12 పాయింట్లు సాధించగా, బుల్స్ కేవలం 4 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఇక, బెంగళూరులో అజయ్‌ కుమార్‌ ఒక్కడే 6 పాయింట్లు చేశాడు.

ఈ మ్యాచ్‌లో పట్నా ఏకంగా నాలుగు సార్లు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసింది. బెంగళూరు బుల్స్‌ 22 రైడ్‌, 5 ట్యాకిల్‌, 5 అదనపు పాయింట్లు సాధించగా పట్నా 24 రైడ్‌, 12 ట్యాకిల్‌, 8 ఆలౌట్‌, 2 అదనపు పాయింట్లు సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+