Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసిన హర్యానా స్టీలెర్స్

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో హర్యానా స్టీలెర్స్‌ ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ 36-29తో బెంగాల్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వాజిర్‌ సింగ్‌ 10 పాయింట్లు స్కోర్‌ చేయగా, టాకిల్‌లో మోహిత్‌ చిల్లర్‌ 4 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఇక, సుర్జీత్‌ సింగ్‌ 8 పాయింట్లు సాధించాడు. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున మనీందర్‌ సింగ్‌ 14 పాయింట్లు సాధించి ఈ మ్యాచ్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. వినోద్‌ కుమార్‌ 4 పాయింట్లు స్కోర్‌ చేశాడు. మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌ 47-21తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది.

Haryana Steelers End Bengal Warriors' Winning Streak

ప్రదీప్‌ నర్వాల్‌ 21 రెయిడ్‌ పాయింట్లతో చెలరేగడంతో మంగళవారం ఏకపక్షంగా సాగిన అంతర్‌ జోన్‌ ఛాలెంజ్‌ పోరులో పట్నా 47-21 పాయింట్లతో జైపూర్‌పై ఘన విజయం సాధించింది. రైడర్ ప్రదీప్‌ నర్వాల్‌ 22 సార్లు రైడింగ్‌కు వెళ్లి 21 పాయింట్లు స్కోర్‌ చేశాడు.

ఈ సీజన్‌లో అతను వేగంగా 100 రైడ్ పాయింట్లు నమోదుచేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో జైపూర్‌ జట్టు స్కోరు ప్రదీప్‌ స్కోరు ఒకటే కావడం విశేషం. ఇక, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తరఫున పవన్‌ కుమార్‌ 7 పాయింట్లు సాధించాడు.

గాయాలతో కెప్టెన్‌ మంజీత్‌ చిల్లార్‌, జస్వీర్‌ సింగ్‌లు దూరం కావడం పాంథర్స్‌ దెబ్బతీసింది. తాజా విజయంతో జోన్‌-బిలో తొమ్మిది మ్యాచ్‌ల్లో 33 పాయింట్లతో పట్నా పైరెట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ప్రొ కబడ్డీలో బుధవారం:
ఢిల్లీ × బెంగళూరు రాత్రి 8 నుంచి
బెంగాల్‌ × యు ముంబా రాత్రి 9 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌-2లో ప్రసారం

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+