Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివర్లో తడబడి మ్యాచ్‌ని చేజార్చుకున్న తెలుగు టైటాన్స్

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి. మంగళవారం బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివర్లో తడబాటుకు గురైన తెలుగు టైటాన్స్ తగిన మూల్యం చెల్లించుకుంది. గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న టైటాన్స్‌కు వారియర్స్‌ అదిరిపోయే షాకిచ్చింది.

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఎక్కువశాతం టైటాన్స్‌దే ఆధిపత్యం. నీలేష్‌, విశాల్‌ భరద్వాజ్‌, మణిందర్‌సింగ్‌ విజృంభించడంతో టైటాన్స్‌ పైచేయి సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగంలో వారియర్స్ స్టార్‌ రైడర్‌ జంగ్‌ కున్‌ లీ వరుస పాయింట్లు తేవడంతో పాయింట్ల అంతరం తగ్గింది.

మరోవైపు నీలేష్‌ (10) రైడింగ్‌, విశాల్‌.. ట్యాకిల్‌లో రాణించడంతో టైటాన్స్‌ మళ్లీ పుంజుకుంది. మ్యాచ్‌ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా టైటాన్స్‌ జట్టు 30-20 పాయింట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయితే ఆ తర్వాత ఆటతీరు ఒక్కసారిగా గతి తప్పడంతో మరో ఐదు నిమిషాల వరకు కూడా ఒక్క పాయింట్‌ సాధించలేకపోయింది.

Pro Kabaddi League 2017: Haryana Steelers beat Dabang Delhi; Bengal Warriors edge past Telugu Titans

చివరివరకు పోరాడిన వారియర్స్ 32-31 స్కోరుతో చివర్లో ఒక పాయింట్‌తో గెలిచే అవకాశమున్నప్పటికీ, టైటాన్స్ ఒత్తిడికి గురై మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ రైడర్ జాంగ్ కున్ లీ 9 పాయింట్లు సాధించి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి (4 పాయింట్లు) పూర్తిగా విఫలమయ్యాడు.

దబాంగ్ ఢిల్లీపై హర్యానా స్టీలెర్స్ విజయం
ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలెర్స్ 27-24 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. వజీర్‌సింగ్‌ (9) హర్యానా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచే హర్యానా 12-4తో ఢిల్లీపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఒకానొక దశలో 23-25తో ఉత్కంఠను పెంచింది. అయితే రెండు పాయింట్ల అంతరాన్ని అలాగే కొనసాగించుకుంటూ వెళ్లిన హర్యానా చివర్లో విజయం సాధించింది.

ప్రొ కబడ్డీలో బుధారం
తమిళ్‌ తలైవాస్‌ × యుపీ యోధ (రాత్రి 8 గంటలకు)
హర్యానా స్టీలెర్స్‌ × పుణెరి పల్టాన్‌ (రాత్రి 9 గంటలకు)
స్టార్‌స్పోర్ట్స్‌-2లో

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+