గుజరాత్ సంచలనం: ఫైనల్ చేరేందుకు బెంగాల్‌కు మరో అవకాశం
హైదరాబాద్: ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ 42-17తో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ ఏడాది కొత్తగా గుజరాత్ టోర్నీకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
అరంగేట్ర టోర్నీలోనే వరుస విజయాలతో గుజరాత్ అద్భుత ప్రదర్శన చేసింది. సచిన్ (9), మహేంద్ర రాజ్‌పుత్ (8) రైడింగ్‌లో మిఘాని, పర్వేశ్ బైంసాల్ ట్యాకిలింగ్‌లో (చెరో 4 పాయింట్ల)తో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ రైడర్ సచిన్ 17 సార్లు కూతకెళ్లి 9 పాయింట్లు తెచ్చాడు.

ఆరంభం నుంచే గుజరాత్ దూకుడు
మ్యాచ్ ఆరంభం నుంచే గుజరాత్ తన దూకుడుని ప్రదర్శించింది. తొలి రెండు నిమిషాల్లోనే రెండు రైడ్ పాయింట్లు సాధించిన గుజరాత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి గుజరాత్ (13-10)దే ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో కొంతమేరకు పోటీ ఇచ్చిన బెంగాల్ ఆ తర్వాత పూర్తిగా తేలిపోయింది.

కీలక మ్యాచ్‌లో విఫలమైన పట్నా ఆటగాళ్లు
లీగ్ దశలో ఆకట్టుకున్న బెంగాల్ ఈ మ్యాచ్‌లో పేలవ మైన ప్రదర్శన చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మణిందర్ సింగ్, జంగ్ కున్ లీ కీలక మ్యాచ్‌లో విఫలమయ్యా రు. వీరిద్దరూ చెరో పాయింట్ మాత్రమే తీసుకువచ్చారు. ఇక రెండో అర్ధభాగంలో బెంగాల్ వారియర్స్ కేవలం 7 పాయింట్లు మాత్రమే సాధించింది.

వరుసగా పాయింట్లు తెచ్చిన గుజరాత్ రైడర్లు
మరోవైపు గుజరాత్ రైడర్లు వరుసగా పాయింట్లు తెస్తున్నా.. వారియర్స్ మాత్రం కనీసం పోరాటం ప్రదర్శించలేక పోయారు. బెంగాల్ జట్టును గుజరాత్ మూడు సార్లు ఆలౌట్ చేసింది. ఇదిలా ఉంటే బెంగాల్ జట్టు ఫైనల్‌కు చేరడానికి మరొక అవకాశం ఉంది. గురువారం జరిగే క్వాలిఫయర్-2లో డిఫెండింగ్ చాంప్ పట్నా పైరేట్స్‌తో బెంగాల్ తలపడనుంది.

ఫైనల్ చేరేందుకు బెంగాల్‌కు మరో అవకాశం
ఈ మ్యాచ్‌లో బెంగాల్ విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ విజృంభణతో పుణెపై 42-32తో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఎలిమినేటర్-3లో పట్నా పైరేట్స్ 42-32తో పుణెరి పల్టన్‌ను చిత్తు చేసింది. డుబ్కీ కింగ్ పర్దీప్ 19 రైడ్ పాయింట్లతో పట్నా విజయంలో కీలకపాత్ర పోషించాడు. పట్నా.. చివరి ఆరు నిమిషాల్లో పర్దీప్ సూపర్ రైడ్‌తో మ్యాచ్‌లోకి వచ్చింది.

బెంగాల్‌తో క్వాలిఫయర్-2లో తలపడనున్న పట్నా
ఒక దశలో 24-29తో వెనుకబడి ఓటమి దిశగా సాగిన పట్నా పైరెట్స్‌ను పర్దీల్ నర్వాల్ విజయం దిశగా నడిపించాడు. ఒకే రైడ్‌లో నలుగురు ఆటగాళ్లను అవుట్ చేసి పట్నా పైరెట్స్ పుంజుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో చోటు కోసం పట్నా పైరేట్స్ గురువారం బెంగాల్‌తో క్వాలిఫయర్-2లో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications