హైదరాబాద్: ఐపీఎల్ మహా సంగ్రామం ముగిసింది. ఆ వెంటనే ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్ ఆటగాళ్ల వేలం పాట ప్రారంభమైంది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన వేలం పాటలో ప్రొ కబడ్డీ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. గత సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారులపై ప్రాంఛైజీలు పోటీపోటీగా లక్షలు కురిపించారు.
రైడర్ నితిన్ తోమర్ ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో ఈ ఏడాది కొత్తగా చేరిన జీఎంఆర్ సంస్ధకు చెందిన ఉత్తర్‌ప్రదేశ్ రూ.93 లక్షలకు నితిన్‌ను దక్కించుకుంది. ఉత్తర్ ప్రదేశ్, జైపుర్ ఫ్రాంఛైజీల మధ్య నితిన్ కోసం గట్టి పోటీ నెలకొనడంతో అతడి ధర పెరుగుతూ పోయింది.
ఈ మధ్యలో తెలుగు టైటాన్స్ కూడా పోటీకొచ్చింది. చివరికి రూ.93 లక్షలకు నితిన్ ఉత్తర ప్రదేశ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రైడర్ రోహిత్‌కుమార్‌ను బెంగళూరు రూ.81 లక్షలకు, ఆల్ రౌండర్ మంజీత్ చిల్లార్‌ను రూ.75.50 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్ ప్రాంఛైజీలు కోనుగోలు చేశాయి.

ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు:
* నితిన్ తోమర్- ఉత్తర్ ప్రదేశ్- రూ.93 లక్షలు
* రోహిత్‌కుమార్- బెంగళూరు- రూ.81 లక్షలు
* మంజీత్ చిల్లార్- జైపూర్ - రూ.75.50 లక్షలు
* సెల్వమణి- జైపూర్ - రూ.73 లక్షలు
* సుర్జీత్‌సింగ్ - బెంగళూరు- రూ.73 లక్షలు
* రాజేశ్ నర్వాల్ - ఉత్తర్ ప్రదేశ్- రూ.69 లక్షలు
* సందీప్ నర్వాల్ - పుణెరి పల్టన్- రూ.66 లక్షలు
* అమిత్ హుడా - తమిళనాడు- రూ.63 లక్షలు
* కుల్‌దీప్ - యు ముంబా- రూ.51.50 లక్షలు
* అబోజర్ (ఇరాన్)- గుజరాత్- రూ.50 లక్షలు
* రవీందర్ పహల్- బెంగళూరు- రూ.50 లక్షలు
* అజయ్- బెంగళూరు- రూ.48.50 లక్షలు
* కాశీలింగ్- యు ముంబా- రూ.48 లక్షలు
* మోహిత్ - హర్యానా- రూ.46.50 లక్షలు