హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో రవీంద్ర జడేజా మొదలుపెట్టిన 'బ్రేక్ ద బియర్డ్' సవాల్‌ని విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్‌ని శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనాలు స్వీకరించి ఈ ఛాలెంజ్‌లో పాల్గొని కొత్త లుక్‌లో కనిపించారు.
తాజాగా ఈ 'బ్రేక్ ద బియర్డ్' సవాల్ పట్ల ప్రొకబడ్డీ ఆటగాళ్లు ఆకర్షితులయ్యారు. దీంతో ఈ బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్‌ని స్వీకరించారు. సహచర ఆటగాళ్లకు సవాల్ విసురుతూ సరికొత్త లుక్‌తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రో కబడ్డీ లీగ్ 5వ సీజన్‌లో యు ముంబా జట్టు కెప్టెన్ అనూప్ కుమార్ బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్‌ని స్వీకరించాడు.

అనంతరం ఇతర ఆటగాళ్లకు సవాల్ విసిరాడు. తాను ఈ ఛాలెంజ్‌ని స్వీకరించినట్లు అనూప్ ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో అనూప్ సరికొత్త లుక్‌లో కనిపించాడు. ప్రో కబడ్డీ లీగ్ 5వ సీజన్ జులై 28న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే అనూప్ కెప్టెన్సీలోని యు ముంబా జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. తన తదుపరి మ్యాచ్‌లో యు ముంబా దబాంగ్ ఢిల్లీతో ఆగస్టు 5న నాగ్‌పూర్‌లో తలపడనుంది.