
మాజీ ఎంపి వివేక్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై టైటాన్స్ రెండో విజయం సాధించింది.

అభిమానుల జోష్
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 54-32తో పాట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది.

అభిమానుల జోష్
ఈ సీజన్‌లో అత్యధిక స్కోరుతో పాటు.. 22 పాయింట్ల భారీ తేడాతో గెలుపొంది రికార్డు సృష్టించింది.

కబడ్డీ
ఈ మ్యాచ్‌లో రైడింగ్, డిఫెన్స్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మొదటి అర్ధభాగంలోనే ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసి ప్రేక్షకులకు సిసలైన మజా అందించింది.

అభిమానుల జోష్
స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 11 పాయింట్లతో విజృంభించగా, ఆల్‌రౌండర్ దీపక్ హుడా (9), సుఖేష్ హెగ్డే (6) మరోసారి సత్తా చాటారు. కెప్టెన్ మెరాజ్ షేక్ రెండు సూపర్ రైడ్స్‌తో అలరించాడు.

అభిమానుల సందడి
అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-22తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది.

మంత్రి జగదీశ్ రెడ్డి
రాహుల్‌కు ‘బెస్ట్ రైడర్', దీపక్ ‘బెస్ట్ డిఫెండర్', మెరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచారు.

గోపీచంద్, మంత్రి కామినేని, కళ్యాణ్‌రామ్, తేజ
బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, మంత్రులు జగదీశ్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ సినీనటులు ప్రకాశ్ రాజ్, కళ్యాణ్ రామ్, ప్రభాకర్ (బాహుబలి ఫేమ్) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నటి రేష్మి సందడి
పది మ్యాచ్‌ల్లో ఏడింట్లో నెగ్గిన టైటాన్స్ ప్లేఆఫ్‌కు దాదాపు చేరువైంది.

సంపూర్ణేష్ బాబు, ఇతర నటులు
టైటాన్స్ 39 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన యు ముంబా 40 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

టైటాన్స్ పట్టు
హైదరాబాద్ అంచె పోటీల్లో చివరి రోజైన శుక్రవారం.. జైపూర్‌తో యు ముంబా, పుణేరి పల్టన్‌తో టైటాన్స్ పోటీపడనున్నాయి.

అభిమానుల జోష్
మొదట కూతకు వచ్చిన నర్వాల్‌ను పట్టుకున్న టైటాన్స్.. ఆపై రాహుల్ సక్సెస్ ఫుల్ రైడ్స్‌తో 5-0తో నిలిచింది.

టైటాన్స్ ఆనందం
ఐదో నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టైటాన్స్ 11-5తో ముందంజ వేసింది. ఆపై వరుసగా తొమ్మిది పాయింట్లు ఖాతాలో వేసుకొని 20-5తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది.

టైటాన్స్ జోష్
రాహుల్ చౌదరి మొదటి రైడ్‌కే ఖాతా తెరిచాడు. టైటాన్స్ 11వ నిమిషం, 17వ నిమిషంలో మరోసారి పాట్నాను ఆలౌట్ చేసి 38-12తో బ్రేక్‌కు వెళ్లింది. ద్వితీయార్థంలోనూ మనోళ్లు జోరు కొనసాగించారు.

ప్రకాశ్ రాజ్, ప్రభాకర్
22వ నిమిషంలో పాట్నాను నాలుగోసారి ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని 43-13కు పెంచుకుంది. ఈ దశలో పాట్నా ప్రతిఘటించింది.

గీతాలాపన
రవీ దలాల్ (10), దీపక్ నర్వాల్ (6) రైడింగ్ పాయింట్లు సాధిస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, టైటాన్స్ పట్టు విడవలేదు. ఆధిక్యాన్ని కాపాడుకొని భారీ గెలుపు ఖాతాలో వేసుకుంది.

మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు
రాహుల్‌కు ‘బెస్ట్ రైడర్', దీపక్ ‘బెస్ట్ డిఫెండర్', మెరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచారు. మ్యాచ్‌కు ముందు గాయని అంజనా సౌమ్య జాతీయగీతం ఆలపించింది.


Click it and Unblock the Notifications











