న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత మారలేదు: ఆఖరి అవకాశాన్ని కోల్పోయిన తెలుగు టైటాన్స్

Pro Kabaddi 2019 : Jaipur Beats Bengaluru To Keep Playoff Hopes Alive, Steelers Thrash Titans
Pro Kabaddi: Jaipur stays alive with Bengaluru win, Steelers hammer Titans

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ మరో ఓటమి చవిచూసింది. ఇప్పటికే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు దూరమైన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 32-52తో హరియాణా స్టీలర్స్‌ చేతిలో ఓటమి పాలైంది.

స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (12 పాయింట్లు), ఫర్హద్ (10 పాయింట్లు) ఆకట్టుకున్నా టైటాన్స్‌కు విజయాన్ని అందించలేకపోయారు. హర్యానా తరఫున వికాస్‌ కండోలా 13 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రైడింగ్, ట్యాక్లింగ్‌లో వెనుకబడిన తెలుగు టైటాన్స్.. మూడు సార్లు ఆలౌటైంది.

విశాఖ టెస్టులో రోహిత్ శర్మ కొత్త అవతారం: ఫ్యాన్స్ పుల్ ఖుష్ (వీడియోవిశాఖ టెస్టులో రోహిత్ శర్మ కొత్త అవతారం: ఫ్యాన్స్ పుల్ ఖుష్ (వీడియో

ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. తాజా ఓటమితో మిగిలిన ఒక్క స్థానం కోసం పోటీ పడే అవకాశాన్ని కూడా తెలుగు టైటాన్స్ కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభమై తొలి 10 నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ 10-17తో వెనుకబడింది. ఆ తర్వాత హర్యానా ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ వరుస పాయింట్లు సాధించారు.

దీంతో తొలిసగం ముగిసే సమయానికి టైటాన్స్ 12-31తో నిలిచింది. రెండో అర్ధభాగంలో టైటాన్స్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా... ఆ దిశగా ఆట సాగలేదు. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 41-34తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. దీపక్‌ 16 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మరోవైపు బెంగళూరు తరఫున పవన్‌ షెరావత్‌ (14) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దీపక్‌ (16 పాయింట్లు) సత్తా చాటడంతో జైపూర్‌ విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్స్‌కు ఇప్పటికే ఐదు జట్లు ఢిల్లీ, బెంగాల్, హర్యానా, ముంబై, బెంగళూరు అర్హత సాధించగా ఆరో బెర్త్‌ కోసం జైపూర్, యూపీ పోటీ పడుతున్నాయి.

Story first published: Saturday, October 5, 2019, 8:06 [IST]
Other articles published on Oct 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X