న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL Final: ఢిల్లీ, బెంగాల్‌ల మధ్య ఫైనల్ పోరు.. గెలిచిన జట్టు రికార్డుల్లోకి?!!

Pro Kabaddi: Dabang Delhi vs Bengal Warriors Final match Schedule, Timings, Venue, Teams Details Dream11 Prediction

అహ్మదాబాద్‌: గత మూడు నెలలుగా అభిమానులకు అలరించిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తుది అంకానికి చేరుకుంది. సీజన్ ఆరంభం నుండి అద్భుత ఆటతో సత్తాచాటిన దబంగ్ ఢిల్లీ, ఆరంభంలో తడబడి ఆపై పుంజుకున్న బెంగాల్ వారియర్స్ ఫైనల్ పోరులో అమితుమీ తేల్చుకోనున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో ఢిల్లీ, బెంగాల్ జట్లు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఏ జట్టు గెలిచినా.. పీకేఎల్‌లో కొత్త విజేత అవుతారు.

IPl 2020: ఐపీఎల్‌ చరిత్రలో మొదటిసారి.. బెంగళూరు సహాయక బృందంలో మహిళ!!

సెమీఫైనల్లో ఢిల్లీ 44-38తో బెంగళూరును చిత్తుచేయగా.. బెంగాల్ 37-35తో యూ ముంబైను ఓడించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి 8 గంటలకు ఆహ్మదాబాద్ ఇకా ఎరీనా స్టేడియంలో ఢిల్లీ, బెంగాల్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ద్వారా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవనుంది. ఫైనల్ మ్యాచ్ కాబట్టి అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. మరోవైపు ఇరు జట్లు గెలిచేందుకు కసరత్తులు చేస్తున్నాయి.

ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు ఢిల్లీ, బెంగాల్ జట్లు 14 సార్లు పోటీపడగా.. ఇరు జట్లు చెరో 6 విజయాలు నమోదు చేసాయి. ఇక రెండు మ్యాచులు టైగా ముగిశాయి. ఈ సీజన్‌లో ఢిల్లీ మిగతా జట్లపై విజయం సాధించినా.. ఒక్కసారి కూడా బెంగాల్ జట్టును ఓడించలేదు. తొలి గేమ్ టైతో ముగియగా.. బెంగాల్ రెండో మ్యాచును 9 పాయింట్ల తేడాతో గెలిచింది. దీంతో ఈ సీజన్‌లో బెంగాల్ జట్టుదే పైచేయిగా ఉంది. మరి ఎలా ఆడుతారో చూడాలి.

ఢిల్లీ జట్టుకు రైడర్ నవీన్ కుమార్ పెద్ద ప్లస్. అతను ప్రతి మ్యాచులో సూపర్-10 సాధిస్తున్నాడు. ఇతన్ని ఆపకపోతే బెంగాల్ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సిందే. కెప్టెన్ రవీందర్ పహల్, విజయ్, చంద్రన్ రంజిత్, జోగిందర్ నార్వాల్ కీలక ఆటగాళ్లు. బెంగాల్ జట్టులో మనీందర్ సింగ్, సుకేష్ హెగ్డే, కె ప్రపంజన్, రింకు నార్వాల్ ముఖ్య ఆటగాళ్లు.

Dabang Delhi Starting 7:
Ravinder Pahal (D), Vijay (All-rounder), Vishal Mane (D), Naveen Kumar (R), Anil Kumar (D), Chandran Ranjit (R), Joginder Narwal (D).

Bengal Warriors Starting 7:
Baldev Singh (D), Mohammed Nabibakhsh (A), Mayur Shivtarkar (A), Maninder Singh / Sukesh Hegde (R), Jeeva Kumar (D), K Prapanjan (R), Rinku Narwal (D).

Story first published: Friday, October 18, 2019, 17:13 [IST]
Other articles published on Oct 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X