Pro Kabaddi: చెలరేగిన మనీందర్, మోహిత్.. బెంగాల్, పుణేకు సూపర్ విక్టరీస్

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు జరిగిన రెండు మ్యాచ్‌లు వన్‌సైడేడ్‌గా ముగిశాయి. జైపూర్‌పై బెంగాల్, ఢిల్లీపై పుణే సునాయసంగా గెలిచాయి. బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్స్ పాంథర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాళ్లు చెలరేగారు. మ్యాచ్ మొత్తంలో ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. అలాగే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పుణే ఆటగాళ్లు కూడా వన్‌సైడేడ్‌గా రాణించి సునాయసంగా మ్యాచ్‌ను గెలిచారు.
బెంగాల్ ఘనవిజయం
జైపూర్ పింక్ పాంథర్స్‌పై బెంగాల్ వారియర్స్ ఘన విజయం సాధించింది. 41-22 పాయింట్ల భారీ తేడాతో గెలిచింది. బెంగాల్ జట్టులో మనీందర్ సింగ్ సూపర్ 10తో సత్తా చాటాడు. అతను మొత్తం 13 పాయింట్లు సాధించాడు. అతనికి తోడుగా ఎస్మాయిల్ నబీబక్ష్ 6, సుఖేష్ హెగ్దే, రాన్ సింగేసి నాలుగేసి పాయింట్లు, విశాల్, అబోజార్, ఆనంద్ రెండేసి పాయింట్లు సాధించారు. ఇక జైపూర్ జట్లులో అర్జున్ దేశ్వాల్ సూపర్ 10 సాధించాడు. అమిత్ నగర్ 6, విశాల్, సందీప్ రెండేసి, నితిన్, సచిన్ చెరో పాయింట్ సాధించారు. కాగా ఈ సీజన్‌లో బెంగాల్‌కు ఇది ఏడో విజయం.
పుణే సూపర్ విక్టరీ
ఇక దబాంగ్ ఢిల్లీతో జరిగిన మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ జట్టు ఘన విజయం సాధించింది. 42-25 పాయింట్ల భారీ తేడాతో పుణే గెలిచింది. ఆ జట్టులో మోహిత్ గోయత్ సూపర్ 10 తో సత్తా చాటాడు. అస్లాం 8, నితిన్ తోమర్, సోంబిర్ ఆరేసి, అభినేషి 3, సంకేత్ ఒక పాయింట్ సాధించారు. ఇక ఢిల్లీ జట్టులో విజయ్ మాలిక్ 8, నీరజ్ నర్వాల్ 6, సందీప్ నర్వాల్ 5, అశు మాలిక్ 2, క్రిషన్, సుశాంత్ సాయిల్ చెరో పాయింట్ సాధించారు. కాగా పుణేరి పల్టాన్ ఖాతాలో ఇది ఆరో విజయం.
పాయింట్ల పట్టిక
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 విజయాలతో బెంగళూరు బుల్స్ అగ్ర స్థానంలో ఉంది. ఇక ఏడేసి విజయాలు సాధించిన దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్, పాట్నా పైరేట్స్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక 5 విజయాలు సాధించిన యూపీ యోధా ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆరో స్థానంలో హర్యాణా స్టీలర్స్, ఏడో స్థానంలో యు ముంబా, ఎనిమిదిలో జైపూర్ పింక్ పాంథర్స్, తొమ్మిదిలో తమిళ్ తలైవస్, 10లో పుణేరి పల్టాన్, 11లో గుజరాత్ జెయింట్స్ ఉండగా.. చిట్ట చివరన 12వ స్థానంలో తెలుగు టైటాన్స్ ఉంది. ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఇప్పటివరకు ఒకే ఒక్క విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications