న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌గా అబొజర్‌ మిఘాని.. ఈవెంట్స్‌ నౌ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు

Pro Kabaddi League 2019 : Abozar Mighani To Captain Telugu Titans || Oneindia Telugu
Pro Kabaddi 2019: Telugu Titans pick Abozar Mighani as captain, PKL online ticketing eventsnow

జులై 20న ప్రొకబడ్డీ సీజన్‌-7 ప్రారంభం కానుంది. ఏడో సీజన్‌ కోసం దాదాపుగా అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే శిక్షణ ముగించుకుని టోర్నీకి సిద్ధంగా ఉన్న జట్లు టైటిల్‌ సాదించేందుకు కొత్త కెప్టెన్‌లకు బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు టైటాన్స్‌ జట్టు కెప్టెన్‌గా ఇరాన్‌ డిఫెండర్‌ అబొజర్‌ మిఘానిని ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో తెలుగు టైటాన్స్‌ యాజమాన్యం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త కెప్టెన్‌ను అధికారికంగా ప్రకటించారు.

యుముంబా కెప్టెన్‌గా ఫజల్‌.. పుణెరి పల్టాన్‌ కెప్టెన్‌గా సుర్జీత్‌యుముంబా కెప్టెన్‌గా ఫజల్‌.. పుణెరి పల్టాన్‌ కెప్టెన్‌గా సుర్జీత్‌

టైటిల్‌పై గురిపెట్టాం:

టైటిల్‌పై గురిపెట్టాం:

గతకొంత కాలంగా తెలుగు టైటాన్స్‌ జట్టుకు ఆడిన స్టార్‌ ఆటగాడు రాహుల్‌ చౌదరి ఈ సారి లేడు. రాహుల్ లేకపోయినా జట్టుకు ఢోకా లేదని టైటాన్స్‌ జట్టు యజమాని శ్రీనివాస్‌ శ్రీరామనేని తెలిపారు. స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల సమాహారంతో జట్టు ఈసారి పటిష్ఠంగా కనిపిస్తున్నది. టైటిల్‌పై గురిపెట్టాం. ఆరంభం నుంచే ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు.

ఈవెంట్స్‌ నౌ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు:

ఈవెంట్స్‌ నౌ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు:

తొలి అంచె పోటీలు హైదరాబాద్‌లోనే జరుగనున్నాయి. ఇందుకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదిక కానుంది. ఈ లీగ్‌ మ్యాచ్‌ల టికెట్లు https://www. eventsnow.com (ఈవెంట్స్‌ నౌ) వెబ్‌సైట్‌లో లభిస్తాయి. టికెట్ల ధరలను రూ. 500, రూ.800, రూ. 3000గా నిర్ణయించారు. టిక్కెట్లు కొనుక్కునేవారు ఈవెంట్స్‌ నౌ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి కావాలసిన మ్యాచ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

యుముంబాతో తొలి మ్యాచ్:

యుముంబాతో తొలి మ్యాచ్:

జులై 20న తెలుగు టైటాన్స్‌, యుముంబా మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. పన్నెండు జట్ల మధ్య టోర్నీని ఈసారి డబుల్‌ రౌండ్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. అన్ని జట్లు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. లీగ్‌ దశ ముగిశాక తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేఆఫ్స్‌ నిర్వహిస్తారు. ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్‌ 19న గ్రేటర్‌ నోయిడాలో జరిగే ఫైనల్‌తో ఏడో సీజన్‌ ముగుస్తుంది.

Story first published: Thursday, July 18, 2019, 13:20 [IST]
Other articles published on Jul 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X