Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టైటాన్స్ నాలుగో ఓటమి.. కొనసాగుతున్న గుజరాత్‌ జోరు

Pro Kabaddi League 2019 : Patna Pirates Defeat Telugu Titans 22-34 || Oneindia Telugu
Pro Kabaddi 2019: Patna Pirates thrash Telugu Titans 22-34, Gujarat Fortunegiants beat UP Yoddha registering a 44-19 win

హైదరాబాద్‌: ప్రో కబడ్డీ సీజన్‌-7లో తెలుగు టైటాన్స్‌ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. సొంతగడ్డపై బోణీ కొట్టాలన్న టైటాన్స్ ఆశలు నెరవేరలేదు. కోచ్, కెప్టెన్,ఆటగాళ్లు మారినా జట్టు ఆట తీరులో మాత్రం మార్పు రాలేదు. విజయం కోసం ఎదురుచూసిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. టైటాన్స్‌ తొలి అంచె పోటీలను విజయం లేకుండానే ముగించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

బాహుబలి బ్రదర్స్ విఫలం:

బాహుబలి బ్రదర్స్ విఫలం:

శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 22-34 తేడాతో పట్నా పైరేట్స్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. బాహుబలి సిద్ధార్థ్‌ దేశాయ్ 12 సార్లు రైడ్‌కు వెళ్లి కేవలం ఐదు పాయింట్లే తెచ్చాడు. గత మ్యాచ్‌లో మెరిసిన సూరజ్‌ దేశాయ్ పూర్తిగా నిరాశపరిచాడు. డిఫెన్స్‌లో కూడా కెప్టెన్‌ అబోజర్‌, విశాల్‌ విఫలమయ్యారు.

తొలి నాలుగు నిమిషాలే:

తొలి నాలుగు నిమిషాలే:

తొలి నాలుగు నిమిషాలే టైటాన్స్‌ ఆటలో ఉంది. ఆ తర్వాత పైరేట్స్‌దే హవా సాగింది. పర్‌దీప్‌ నర్వల్ రైడింగ్‌లో చెలరేగడంతో ఎనిమిదో నిమిషంలోనే టైటాన్స్‌ 6-11తో వెనకబడింది. అక్కడి నుండి ఏ దశలోనూ పుంజుకొలేదు. ఇక ట్యాక్లింగ్‌లో జైదీప్‌ (6) మెరవడంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి పట్నా 23-9తో ఆధిక్యాన్ని సంపాదించింది. విరామం తర్వాత కూడా టైటాన్స్‌ ఆటగాళ్లు నిరాశపరిచారు. ఫలితంగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. పట్నా 12 రైడ్, 16 టాకిల్‌ పాయింట్లు చేయగా.. టైటాన్స్‌ 10 రైడ్‌, 8 టాకిల్‌ పాయింట్లు చేసింది.

 గుజరాత్‌ జోరు:

గుజరాత్‌ జోరు:

గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ తన జోరును కొనసాగిస్తోంది. 44-19తో యూపీ యోధను చిత్తుగా ఓడించి వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్‌ ఆటగాళ్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. రైడర్లు రోహిత్‌ గులియా (11), సచిన్‌ (6) రెచ్చిపోవడంతో తొలి అర్ద భాగంలోనే గుజరాత్‌ 19-9తో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో యూపీ 10 పాయింట్లే సాధించగా.. గుజరాత్‌ 25 పాయింట్లు సాధించింది. యూపీ స్టార్‌ రైడర్‌ మోనూ గోయత్‌ ఎనిమిది సార్లు రైడ్‌కు వెళ్లి కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. ఇది యూపీపై పెద్ద ప్రభావం చూపింది. శ్రీకాంత్‌ జాదవ్‌ (5) ఆకట్టుకున్నాడు.

Story first published: Saturday, July 27, 2019, 9:44 [IST]
Other articles published on Jul 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+