హోరాహోరీ పోరులో తలైవాస్‌పై పాయింట్ తేడాతో పట్నా విజయం

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో మరో హోరాహోరీ మ్యాచ్ జరిగింది. పట్నా పైరేట్స్‌పై విజయం కోసం చివరి వరకు పోరాడిన తమిళ్ తలైవాస్ కేవలం ఒక పాయింట్ తేడాతో ఓడిపోయింది. సోమవారం ముంబైలో జరిగిన మ్యాచ్‌లో పట్నా 24-23 తేడాతో తలైవాస్‌పై విజయం సాదించింది. విజయం అంచున వరకు వచ్చి ఓడిపోవడం తలైవాస్‌కు వరుసగా రెండో మ్యాచ్. పైరేట్స్ డిఫెండర్ జైదీప్ 5 టాకిల్ పాయింట్లతో పాటు రెండు బోనస్ పాయింట్లు తెచ్చి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ చౌదరి (5 పాయింట్లు), మంజీత్ చిల్లర్ (4 పాయింట్లు) ఆకట్టుకోలేకపోయారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
తలైవాస్‌దే పైచేయి:
పట్నా పైరేట్స్‌కు ఏమంత మంచి ఆరంభం లభించలేదు. మరోవైపు తలైవాస్ మొదటి మూడు నిమిషాల్లోనే నాలుగు పాయింట్లు సాధించి 4-0తో అధిక్యంలోకి వెళ్ళింది. ఈ సమయంలో రాహుల్‌ని సూపర్ టాకిల్ చేసిన పట్నా.. రెండు పాయింట్లు సాధించి ఖాతా తెరిచింది. ఆ వెంటనే ఇస్మాయిల్.. రైడింగ్ పాయింట్‌తో పాటు బోనస్ పాయింట్‌ను సాధించి స్కోరును సమం చేశాడు. అనంతరం రెండు జట్లు పాయింట్‌ల కోసం పోటీ పడ్డాయి. విరామ సమయానికి 11-11తో సమంగా నిలిచాయి.

సూపర్ టాకిల్ చేసినా:
రెండో భాగంలో కూడా తలైవాస్, పట్నా రైడర్లు సత్తా చాటారు. అయితే ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా.. తలైవాస్ 18-22తో వెనుకబడింది. కీలక సమయంలో తలైవాస్ రైడర్లు రాహుల్, రాన్ సింగ్‌లు మూడు పాయింట్లు తెచ్చి పట్నా స్కోరుకు చెరువయ్యారు. వెంటనే పుంజుకున్న పట్నా రెండు పాయింట్లను సాధించడంతో స్కోరు 21-24తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రైడ్‌కు వెళ్లిన ప్రదీప్‌ను సూపర్ టాకిల్ చేసిన తలైవాస్‌కు రెండు పాయింట్లు రావడంతో పాయింట్ తేడాతో ఓడిపోయింది.

మణిందర్ మాయ:
మరో మ్యాచ్‌లో బెంగాల్‌వారియర్స్ 43-23తో పుణేరి పల్టన్‌పై ఘన విజయం సాధించింది. రైడర్ మణిందర్ సింగ్ (14) సత్తాచాటడంతో వారియర్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. బెంగాల్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పుణెరి వరుసగా మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుని ఇప్పటి వరకు పాయింట్ల ఖాతా తెరవలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications