న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రో కబడ్డీ: చెన్నై అంచె ఫస్టాఫ్ తర్వాత... రైడ్, ట్యాకిల్ పాయింట్లలో అగ్రస్థానం వీరిదే!

 Pro Kabaddi 2019: Most Raid Points, Most Tackle Points (Updated) after the first half of Chennai leg

హైదరాబాద్: చెన్నై అంచెలో భాగంగా జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో హై క్వాలిటీ కబడ్డీను అభిమానులు ఆస్వాదించారు. అయితే, సొంతగడ్డపై తమిళ తలైవాస్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా సాధించకపోవడం విశేషం. ప్రో కబడ్డీ 7వ సీజన్‌లో తమిళ తలైవాస్ జట్టులోకి రాహుల్ చౌదరి రాక కొత్త ఉత్సాహాన్ని నింపింది.

సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళ తలైవాస్ చిత్తుగా ఓడింది. బుల్స్ రైడర్ పవన్ షెరావత్ 11 రైడ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హర్యానా స్టీలెర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయాన్ని నమోదు చేసింది. సిద్దార్ద్ దేశాయ్ 18 రైడ్ పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

<strong>వికాస్‌ ఖండోలా మెరుపులు.. యు ముంబాకు హరియాణా ఝలక్‌ </strong>వికాస్‌ ఖండోలా మెరుపులు.. యు ముంబాకు హరియాణా ఝలక్‌

యు ముంబాకు షాకిచ్చిన హర్యానా స్టీలెర్స్

యు ముంబాకు షాకిచ్చిన హర్యానా స్టీలెర్స్

ఇక, చెన్నై అంచెలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో యు ముంబాకు హర్యానా స్టీలెర్స్‌ షాకిచ్చింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 30-27తో యు ముంబాను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో డిఫెన్స్‌ తప్పిదాలతో ముంబా మూల్యం చెల్లించుకుంది.

5 పాయింట్లతో చెలరేగిన సందీప్‌ నర్వాల్‌

5 పాయింట్లతో చెలరేగిన సందీప్‌ నర్వాల్‌

ఆట చివరలో హర్యానా పుంజుకోవడంతో మ్యాచ్ సొంతం చేసుకుంది. ముంబా ఆల్‌రౌండర్‌ సందీప్‌ నర్వాల్‌ కేవలం 5 పాయింట్లు సాధించాడు. దీంతో చెన్నై అంచెలో అర్ధభాగం మ్యాచ్‌లు ముగిశాయి. చెన్నై అంచె తొలి అర్ధభాగం ముగిసే సరికి అత్యధిక రైడ్ పాయింట్లు, అత్యధిక ట్యాకిల్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల వివరాలను ఒక్కసారి చూద్దాం...

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్‌కు ఇద్దరు కెప్టెన్‌లు

పవన్ కుమార్ షెరావత్

పవన్ కుమార్ షెరావత్

బెంగళూరు బుల్స్‌కు చెందిన పవన్ కుమార్ షెరావత్ 98 రైడ్ పాయింట్లతో జాబితాలో అగ్రస్థానంలొ కొనసాగుతున్నాడు. నవీన్ కుమార్ (దబాంగ్ ఢిల్లీ - 75 రైడ్ పాయింట్లు), సిద్ధార్ధ్ దేశాయ్(తెలుగు టైటాన్స్ - 68 పాయింట్లు), పరదీప్ నర్వాల్(పట్నా పైరెట్స్-64 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

యాషెస్‌ మూడో టెస్టుకూ అండర్సన్‌ దూరం.. మొయిన్‌ అలీకి నిరాశే!!

https://telugu.mykhel.com/cricket/ashes-2019-james-anderson-left-out-as-england-name-unchanged-squad-for-3rd-test-022926.html

సందీప్ కుమార్ ధుల్

సందీప్ కుమార్ ధుల్

జైపూర్ పింక్ ఫాంథర్స్‌కు చెందిన సందీప్ కుమార్ ధుల్ 31 ట్యాకిల్ పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సుమీత్ (యుపి యోధా- 30 ట్యాకిల్ పాయింట్లు), విశాల్ భరద్వాజ్(తెలుగు టైటాన్స్-29), జైదీప్(పట్నా పైరెట్స్-26 పాయింట్ల) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Tuesday, August 20, 2019, 17:11 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X