దబంగ్ ఢిల్లీ హ్యాట్రిక్.. యు ముంబాకు బుల్స్ షాక్

ముంబై : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో దబంగ్ ఢిల్లీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆదివారం ముంబైలో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 41-21 పాయింట్లతో హరియాణా స్టీలర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఢిల్లీ రైడర్లు చంద్రన్ రంజిత్ (11 పాయింట్లు), నవీన్ కుమార్ (10 పాయింట్లు)లు జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. నవీన్ కుమార్ ఈ సీజన్‌లో రెండో 'సూపర్ 10' నమోదు చేసాడు. సయిద్ ఘఫారి డిఫెన్స్‌లో అదరగొట్టడంతో ఢిల్లీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ఢిల్లీ ఆధిక్యం:
మ్యాచ్ తొలి రైడ్‌లో రంజిత్ రెండు పాయింట్లు తెచ్చి ఢిల్లి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. ఇదే ఊపులో తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి 7-4తో ఢిల్లీ ఆధిక్యంలోకి వెళ్ళింది. పుంజుకొన్న హరియాణా ఆటగాళ్లు 8-9తో అడగగొట్టారు. ఈ సమయంలో జోగిందర్ నర్వాల్ సూపర్ ట్యాకిల్ చేయడంతో 11-8తో దూసుకుపోయింది. ఇక తొలి అర్ధ భాగాన్ని ఢిల్లీ 15-10తో ముగించింది.

మరింత దూకుడు:
విరామం తర్వాత ఢిల్లీ మరింత దూకుడు పెంచింది. రంజిత్, నవీన్ వరుసగా పాయింట్లు తేవడంలో 23వ నిమిషంలో హరియాణా తొలిసారి ఆలౌట్ అయింది. చివరి పది నిమిషాల ఆట మిగిలి ఉందనగా.. మరోసారి హరియాణాను ఆలౌట్ చేసిన ఢిల్లీ 33-16తో నిలిచింది. అదే జోరులో భారీ విజయాన్ని అందుకుంది. హరియాణా జట్టులో నవీన్ (9) రైడింగ్‌లో మెరిశాడు. అయితే ట్యాక్లింగ్‌లో పూర్తిగా విఫలమైంది.

ఆరంభంలో హోరాహోరీగా:
మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్ ఆతిథ్య యు ముంబాకు షాకిచ్చింది. సొంత ప్రేక్షకుల మధ్య ఒత్తిడికి లోనై ముంబై 26-30తో ఓటమి పాలైంది. ఆరంభంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆరు నిమిషాలు ముగిసేసరికి 3-3తో సమంగా నిలిచాయి. ఆటగాళ్లు పాయింట్ల కోసం పోటీపడడంతో 17వ నిమిషంలోనూ స్కోర్లు మళ్లీ 11-11తో సమం అయింది. ఈ సమయంలో సౌరభ్ సూపర్ ట్యాకిల్ చేయడంతో బుల్స్ 13-11తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

పవన్ మెరుపులు:
విరామం తర్వాత ముంబా సత్తా రేసులోకి వచ్చింది. బుల్స్‌ను ఆలౌట్ చేసి 16-13తో ఆధిక్యం సంపాదించింది. మరో నాలుగు నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉందనగా.. ముంబానే 23-22తో ఆధిక్యంలో నిలిచింది. కానీ బుల్స్ రైడర్ పవన్ వరుసగా పాయింట్లు తేవడంతో ముంబాను ఆలౌట్ చేసి 28-25తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications