తెలుగు టైటాన్స్‌కు తప్పని ఓటమి.. బుల్స్ చేతిలో పరాజయం

Pro Kabaddi League 2019 : Bengaluru Bulls Defeats Telugu Titans 40-39 || Oneindia Telugu

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి. శుక్రవారం చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఒక్క పాయింట్‌ తేడాతో ఓడింది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 40-39తో టైటాన్స్‌పై గెలిచింది.

4వ టెస్టు, డే3: మార్నింగ్ సెషన్ వర్షార్పణం, ఆసీస్ విజయానికి వర్షం అడ్డంకి!

ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో తెలుగు టైటాన్స్‌ 23-32తో ఓటమి దిశగా పయనించింది. అలాంటి పరిస్థితుల్లోనూ సిద్ధార్థ్‌ చెలరేగి ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 23 పాయింట్లతో సిద్ధార్థ్ అదరగొట్టినా.. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

ఒకే రైడ్‌లో నలుగురిని ఔట్‌ చేయడంతో బుల్స్‌ను ఆలౌట్‌ చేసిన టైటాన్స్‌ 33-35తో నిలిచింది. అయితే, చివర్లో బుల్స్ రైడర్ పవన్‌ కూడా దూకుడుగా ఆడటంతో బెంగళూరు 40-38తో విజయం దిశగా సాగింది. చివరి రైడ్‌లో సిద్ధార్థ్‌ రెండు పాయింట్ల తెస్తే మ్యాచ్‌ టైగా ముగిసేది.

అతను ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకున్నాడు. మరోవైపు బెంగళూరు బుల్స్‌ జట్టులో పవన్‌ షెరావత్ కూడా 23 పాయింట్లు సాధించాడు. 13 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కు ఇది ఏడో పరాజయం. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 41-29తో పాట్నా పైరేట్స్‌పై గెలిచింది.

ప్రొ కబడ్డీలో శనివారం

బంగాల్‌ vs గుజరాత్‌ (రాత్రి 7:30 గంటల నుంచి)

ఢిల్లీ vs హర్యానా (రాత్రి 8:30 గంటల నుంచి)

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, September 7, 2019, 8:17 [IST]
Other articles published on Sep 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X