Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పట్నాపై టైటాన్స్‌కు విజయం, చివరి 3 గెలిస్తేనే ప్లే ఆఫ్‌లోకి..

Pro Kabaddi 2018 : Telugu Titans Defeated Patna Pirates | Oneindia Telugu
Pro Kabaddi 2018, Telugu Titans vs Patna Pirates highlights: Telugu Titans secure 41-36 win against Patna Pirates

విశాఖపట్నం: గతమ్యాచ్‌లో ఓటమితో నిరాశపరిచిన తెలుగు టైటాన్స్‌ మళ్లీ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో టైటాన్స్ సొంతగడ్డపై జరిగిన ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. గురువారం జరిగిన జోన్‌-బి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ప్రథమార్ధానికి 26-15తో ఆధిక్యంలో నిలిచిన టైటాన్స్‌ చివరకు 5 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఇలా 41-36 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ పట్నా పైరేట్స్‌ను ఓడించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

లీగ్ చరిత్రలో 800 రైడింగ్ పాయింట్లు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. రాహుల్‌ చౌదరీ (13) అంచనాల మేర రాణించి అభిమానులకు ఆనందాన్ని మిగిల్చాడు. అతనితో పాటు నీలేశ్ సులంకే (9), మోహసెన్ (5), విశాల్ (4) మెరవడంతో టైటాన్స్‌ సులభంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

తొలి అర్ధభాగంలో నెమ్మదిగా ఆడిన పర్‌దీప్ నర్వాల్ 12 పాయింట్లతో పట్నా తరఫున టాప్‌లో నిలిచాడు. మిగిలిన ప్లేయర్లు విజయ్‌ 6, జైదీప్‌ 4, వికాస్‌ కాలె 3 పాయింట్లు చేయగలిగారు. 19 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 50 పాయింట్లు సాధించి జోన్‌- బిలో మూడో స్థానంలో ఉన్న టైటాన్స్‌ ప్లేఆఫ్‌ చేరాలంటే తర్వాత ఆడనున్న మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించాల్సిందే.

శుక్రవారం జరగనున్న మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్‌ వారియర్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడనున్నాయి. వైజాగ్‌లో మ్యాచ్‌లు ముగియగా... శుక్రవారం నుంచి పోటీలు హరియాణాలోని పంచకులలో జరుగనున్నాయి.

Story first published: Friday, December 14, 2018, 8:41 [IST]
Other articles published on Dec 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+