For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పింక్ పాంథర్స్‌పై బెంగాల్ వారియర్స్ రసవత్తరమైన గెలుపు

Pro Kabaddi 2018, Patna Pirates vs U Mumba, Match Highlights: Mumbai edge Patna in a thriller

పట్నా: ప్రొ కబడ్డీలో శనివారం జరిగిన ఇరు గ్రూపు మ్యాచ్‌లలోనూ ఉత్కంఠభరితమైన వాతావరణం చోటు చేసుకుంది. యు ముంబా జట్టు కేవలం ఒక్క పాయింట్ ఆధిక్యంతో పట్నా పైరేట్స్‌పై గెలుపొందగా బెంగాల్ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌తో బెంగాల్‌ వారియర్స్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. వరుసగా మూడో విజయం అందుకుని జోన్‌-బిలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

బెంగాల్‌ 39-28తో పింక్‌ పాంథర్స్‌పై

బెంగాల్‌ 39-28తో పింక్‌ పాంథర్స్‌పై

శనివారం జరిగిన పోరులో బెంగాల్‌ 39-28తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. మొదటి భాగం ఆట 14వ నిమిషం వరకు ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఆ తర్వాత బెంగాల్‌ డిఫెండర్లు అదరగొట్టడంతో ప్రత్యర్థి రైడర్లకు పాయింట్లు సాధించడం కత్తి మీద సాముగా మారింది. డిఫెండర్‌ సుర్జిత్‌ సింగ్‌ (5) అద్భుతమైన టాక్లింగ్‌లతో కీలక సమయంలో పట్టు బిగించడంతో బెంగాల్‌ 18-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

టాక్లింగ్‌లతో రెచ్చిపోయిన బెంగాల్‌ రైడర్లు

టాక్లింగ్‌లతో రెచ్చిపోయిన బెంగాల్‌ రైడర్లు

ఈ దశలో బెంగాల్‌ రైడర్లు మహేష్‌ గౌడ్‌ (7), మణిందర్‌ సింగ్‌ (7) చెలరేగడంతో జైపూర్‌ ఓటమి పాలైంది. శనివారం బెంగాల్‌ 39-28తో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. మహేష్‌గౌడ్‌ (9), మణిందర్‌ (7) రాణించి జట్టును గెలిపించారు. జైపుర్‌ జట్టులో దీపక్‌ హుడా (9) అత్యధిక పాయింట్లు సాధించాడు.

యు ముంబా 40-39తో పట్నా పైరేట్స్‌పై

యు ముంబా 40-39తో పట్నా పైరేట్స్‌పై

హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 40-39తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. సిద్ధార్థ్‌ దేశాయ్‌ (15), రోహిత్‌ బలియన్‌ (11) సూపర్‌-10లు సాధించి యు ముంబాను గెలిపించారు. ‘డుబ్కీ' పట్నా తరఫున ఆ జట్టు కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ (17) చెలరేగినా... ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో పట్నా పైరేట్స్‌ పరాజయం పాలైంది. శనివారం యు ముంబాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి వరకు రేసులో నిలిచిన పట్నా ఆఖరకు 39-40తో ఓడింది.

యు ముంబా తరఫున సిద్ధార్థ్‌ దేశాయ్‌ 14

యు ముంబా తరఫున సిద్ధార్థ్‌ దేశాయ్‌ 14

ట్యాక్లింగ్‌లో జైదీప్‌ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. యు ముంబా తరఫున సిద్ధార్థ్‌ దేశాయ్‌ 14, రోహిత్‌ 11 రైడ్‌ పాయింట్లతో చెలరేగారు. ట్యాక్లింగ్‌లో ఫజల్‌ (6 పాయింట్లు) సత్తాచాటాడు. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీతో యూపీ యోధా, పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్‌ ఆడతాయి.

Story first published: Sunday, October 28, 2018, 11:53 [IST]
Other articles published on Oct 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+