ప్రో కబడ్డీ: పుణె బోణీ, సొంతగడ్డపై తమిళ్ తలైవాస్ ఓటమి


హైదరాబాద్: చెన్నై వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో సోమవారం జరిగిన పోటీల్లో పుణె, యూపీ జట్లు విజయం సాధించాయి. జోన్-ఎ లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 34-22 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో పుణెరి పల్టాన్ తొలిసారి బోణీ చేసింది.
తొలి మ్యాచ్‌లో యు ముంబాతో డ్రా చేసుకున్న పల్టన్.. సోమవారం హరియాణా స్టీలర్స్‌తో జోన్-ఏ రెండో మ్యాచ్‌లో 34-22తో నెగ్గి లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. నితిన్ తోమర్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో హరియాణా జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.

ఏడో నిమిషంలోనే హరియాణా 4-2తో ఆధిక్యం
పటిష్టమైన డిఫెన్స్‌తో పాటు రైడింగ్‌లో దూకుడుతో ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే హరియాణా 4-2తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్న పుణెరి.. 6-7తో హరియాణాను సమీపించింది. సురేందర్ నాడా రెండు ట్యాకిల్ పాయింట్లు తేవడంతో ఆధిక్యంలోకి వెళ్లిన పుణెరి.. ఆ తర్వాత నితిన్ తోమర్ రెండు రైడ్ పాయింట్లు సంపాదించడంతో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది.

19వ నిమిషంలో హరియాణాను ఆలౌట్ చేసిన పుణెరి
19వ నిమిషంలో హరియాణాను ఆలౌట్ చేసి 14-8తో నిలిచింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి పల్టన్ 15-9తో ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో హరియాణా పుంజుకుని ఐదు పాయింట్లు గెలవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నితిన్ మరోసారి డబుల్ రైడ్ పాయింట్ గెలవడంతో 20-14తో నిలిచిన పుణెరి.. 36వ నిమిషంలో మరోసారి హరియాణాను ఆలౌట్ చేసి 30-17తో నిలిచింది.

యూపీ యోధ చేతిలో తమిళ్ తలైవాస్ ఓటమి
చివర్లో హరియాణా పుంజుకున్నప్పటికీ 34-22తో విజయాన్ని సొంతం చేసుకుంది. నితిన్ తోమర్ ఏడు పాయింట్లతో పల్టన్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రవికుమార్ మూడు ట్యాకిల్ పాయింట్లు తెచ్చాడు. జీబీ మోర్ ఆరు, దీపక్ కుమార్ దహియా ఐదు పాయుంట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 37-32తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది.

అజయ్ ఠాకూర్ అద్భుత పోరాటం
తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్‌కు షాకిచ్చి జోరు మీదున్న తలైవాస్.. యుపి యోధతో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే తడబడింది. వరుస రైడ్ పాయింట్లతో పాటు, ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన యోధ 15-2తో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలో అజయ్ ఠాకూర్ అద్భుత పోరాటం చేయడంలో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించి, స్వల్ప స్కోరుతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications