మరోసారి పరాజయానికి గురైన తెలుగు టైటాన్స్


హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో తెలుగు టైటాన్స్ తొలిసారి పేలవ ప్రదర్శన చేసింది. టోర్నీలో ఆ జట్టు రెండో ఓటమి ఎదుర్కొంది. మంగళవారం టైటాన్స్ 21-40 తేడాతో యు ముంబా చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటికే తెలుగు జట్టు ఒక మ్యాచ్ ఓడినా.. ఆ ఓటమిలో మరీ ఇంత వ్యత్యాసం కనిపించలేదు. మ్యాచ్‌లో పూర్తిగా ముంబాదేఆధిపత్యం. ఆ జట్టు ఆటగాడు సిద్దార్థ్ దేశాయ్ చెలరేగి ఆడి ఏకంగా 17 పాయింట్లు కొల్లగొట్టాడు.

ప్రథమార్ధం ముగిసేసరికి 17-12తో
టైటాన్స్ జట్టు మొత్తం కలిసి అతడి కంటే నాలుగు పాయింట్లు మాత్రమే ఎక్కువ సాధించింది. ఆరంభంలోనే రెండు పాయింట్లతో ముంబైకి ఆధిక్యాన్నందించిన సిద్దార్థ్.. 13వ నిమిషంలో సూపర్ రైడ్‌తో ముంబాను 13-7తో పైచేయిలో నిలిపాడు. ప్రథమార్ధం అయ్యేసరికి ఆ జట్టు 17-12తో ముందంజలో నిలిచింది. రెండో అర్ధంలో దేశాయ్ చెలరేగిపోయాడు. క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ ముంబాను తిరుగులేని స్థితికి తీసుకెళ్లాడు.

సిద్దార్థ్ టాప్‌స్కోరర్‌గా
ఈ సీజన్లో ఇప్పటిదాకా 83 పాయింట్లు సాధించిన సిద్దార్థ్ టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ 12 రైడ్ పాయింట్లతో తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి జట్టులో మోరె 10 పాయింట్లతో మెరిశాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ప్రథమార్ధంలో తమిళ జట్టు 16-15తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధంలో తలైవాస్ ఆటగాళ్లు జోరు పెంచి మ్యాచ్ గెలిచారు. ఐదు పరాజయాల తర్వాత తమిళ జట్టు విజయం సాధించడం విశేషం.

700 పాయింట్లతో తొలి ఆటగాడిగా
ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఓడినప్పటికీ.. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలోనే 700 పాయింట్లు సాధించిన తొలి ఆటగా డిగా రికార్డు సృష్టించినా.. తెలుగు టైటాన్స్‌ను మాత్రం ఓటమి నుంచి కాపాడ లేకపోయాడు. ఈ ఓటమి తర్వాత కూడా జోన్-బిలో 16 పాయింట్లతో తెలుగు జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 36-31 తేడాతో పుణెరి పల్టాన్‌ను ఓడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications