Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో కబడ్డీ: చివరి వరకు ఉత్కంఠ, యూపీ-బెంగాల్‌ మ్యాచ్‌ టై

 Pro Kabaddi 2018 Highlights, Puneri Paltan 33-32 U Mumba, Bengal Warriors 40-40 UP Yoddha

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా యూపీ యోధ, బెంగాల్‌ వారియర్స్‌ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌ టైగా ముగిసింది. ఈ సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు నమోదు చేసిన తొలి డ్రా ఇదే కావడం విశేషం. జోన్‌ 'బి'లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 40-40తో బెంగాల్‌తో డ్రాగా ముగిసింది.

ఒక దశలో గెలుపు యూపీవైపు మొగ్గగా.. మణీందర్‌ చెలరేగి బెంగాల్‌ను మ్యాచ్‌లోని తీసుకొచ్చాడు. అయితే, వారియర్స్‌ గెలుపు అంచుపై నిలవగా.. ప్రశాంత్‌ వరుస రైడ్లలో పాయింట్లు తెచ్చి స్కోరును సమం చేశాడు. బెంగాల్‌ తరఫున మణిందర్‌ సింగ్‌ 16, జాంగ్‌ కున్‌ లీ 7 రైడ్‌ పాయింట్లు సాధించారు.

ట్యాక్లింగ్‌లో సుర్జీత్‌ సింగ్‌ (6 పాయింట్లు)తో మెరిశాడు. యూపీ తరఫున ప్రశాంత్‌ కుమార్‌ రాయ్‌ (13), కెప్టెన్‌ రిషాంక్‌ దేవడిగ (9) రైడ్‌ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌ 33-32తో యు ముంబాపై విజయం సాధించింది. ప్రో కబడ్డీలో ఈరోజు దబంగ్‌ ఢిల్లీతో బెంగాల్‌ వారియర్స్, పుణేరీ పల్టన్‌తో బెంగళూరు బుల్స్‌ తలపడనున్నాయి.

Story first published: Sunday, October 21, 2018, 11:49 [IST]
Other articles published on Oct 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+