Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్యానా స్టీలర్స్‌ను ఓడించిన పింక్ ఫాంథర్స్

Pro Kabaddi 2018 highlights: Jaipur Panthers beat Haryana Steelers 39-30

పంచకుల: బెంగళూరు బుల్స్‌ జట్టు ప్రొ కబడ్డీ ప్లేఆఫ్స్‌ (జోన్‌-బి)లో అడుగుపెట్టింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో గత రెండు మ్యాచ్‌లు నెగ్గిన తెలుగు టైటాన్స్‌ మళ్లీ ఓటమిబాట పట్టింది. పవన్‌ షెరావత్‌ (13 పాయింట్లు) మెరవడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 44-28తో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్‌ జట్టులో రాహుల్‌ చౌదరి 10 పాయింట్లు స్కోర్‌ చేశాడు. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 13 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా... అతనికి సరైన సహకారం అందకపోవడంతో తెలుగు టైటాన్స్‌ కీలక సమయంలో మరో ఓటమి మూటగట్టుకుంది.

హరియాణాలో మంగళవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌లో టైటాన్స్‌ 28-44తో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓడింది. బుల్స్‌ తరఫున పవన్‌ 13, రోహిత్‌ కుమార్‌ 7 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో బెంగళూరు జోన్‌ 'బి' నుంచి 'ప్లే ఆఫ్స్‌'కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.

మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ ఫాంథర్స్‌ 39-30తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో జైపూర్ పింక్ ఫాంథర్స్ చివరి వరకూ ఉత్కంఠను రేపింది. ఇరు జట్లు ప్లే ఆఫ్ చేరుకునేందుకు అవకాశాలు మూసుకుపోయాయి. సెల్వమణి సూపర్ రైడ్ ఆడి మూడో నిమిషంలోనే పాయింట్లు సాధించి 5-2లీడ్‌తో జట్టుకు ఆధిక్యం తెచ్చిపెట్టాడు. మరో నాలుగు నిమిషాల్లోనే ఇరు జట్లు 5-5 పాయింట్లతో సమం చేసుకున్నాయి.

మ్యాచ్ అర్థభాగం ముగిసే వరకూ 27-26పాయింట్లతో విజయం నీదా..నాదా అనేట్లుగా సాగింది. 37వ నిమిషంలో మోను గోయెత్ రైడ్‌తో పింక్ ఫాంథర్స్‌కు 30-27తో ఆధిక్యంలోకి చేరింది. ఇలా చివరి ఐదు నిమిషాల వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఎట్టకేలకు జైపూర్ పింక్ ఫాంథర్స్ విజయం సాధించింది.

Story first published: Wednesday, December 19, 2018, 10:59 [IST]
Other articles published on Dec 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+