Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లీగ్‌లో పైరేట్స్‌ ఏడో విజయం.. వరుసగా నాలుగో విజయం

Pro Kabaddi 2018: Gujarat Fortunegiants Register Thrilling Comeback Win Over U Mumba

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్‌ ఏడో విజయం.. వరుసగా నాలుగో విజయం సాధించింది. బుధవారం పట్నా పైరేట్స్‌ జట్టు 45-27తో తమిళ్‌ తలైవాస్‌ను చిత్తుగా ఓడించింది. డుబ్కీ'కింగ్‌ ప్రదీప్‌ నర్వాల్‌ విజృంభించడంతో 13, దీపక్‌ నర్వాల్‌ 10 రైడ్‌ పాయింట్లు సాధించగా మన్‌జీత్‌ చిల్లార్‌ 5 రైడ్‌, 3 టాకిల్‌ పాయింట్లతో అదరగొట్టాడు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పైరేట్స్‌ 16-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.

తలైవాస్‌ తరఫున అజయ్‌ ఠాకూర్‌ (8) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పట్నా పైరేట్స్‌ 38 పాయింట్లతో జోన్‌-బిలో అగ్రస్థానంలో ఉంది. 25 పాయింట్లతో తమిళ్‌ తలైవాస్‌ అట్టడుగున ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో గుజరాత్‌ 39-35తో యు ముంబాపై విజయం సాధించింది. గుజరాత్‌ జట్టులో ప్రపంజన్‌ (10), యు ముంబా జట్టులో సిద్ధార్థ్‌ దేశాయ్‌ (13) ఉత్తమ ప్రదర్శన చేశారు.

చివరిగా 37వ నిమిషంలో మహేంద్ర రాజ్‌పుత్ రైడింగ్‌లో రెండు పాయింట్లు తెచ్చిపెట్టడంతో మ్యాచ్ తీరు తెన్నులుమారిపోయాయి. దీంతో గుజరాత్.. ముంబాపై 34-32 ఆధిక్యంలో నిలిచింది. ఇక ప్రత్యర్థిని ఆల్ అవుట్ చేయడంతో 37-32 పాయింట్లుగా మారిన గుజారత్.. 40వ నిమిషంలో ప్రపంజన్ సాధించిన రెండు పాయింట్లతో యూ ముంబాపై 39-35 స్కోరు చేసింది.

గురువారం మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ తలపడనుంది.

Story first published: Thursday, November 22, 2018, 11:22 [IST]
Other articles published on Nov 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+