Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న యూపీ యోధా

Pro Kabaddi 2018, Bengal Warriors vs UP Yoddha Highlights: BEN 17-33 UP

కోల్‌కతా: ప్రొ కబడ్డీ ఆరో సీజన్లో చివరి ప్లే ఆఫ్‌ బెర్తును యూపీ యోధ దక్కించుకుంది. ఉత్కంఠరేపిన ప్లే ఆఫ్‌ రేసుకు ముగింపు పలుకుతూ.. ఆ జట్టు జోన్‌- బి నుంచి మూడో స్థానంలో నిలిచి ముందడుగు వేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 41-25 తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో 12వ నిమిషానికి స్కోరు 7-7తో సమమైంది.

బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచి 57 పాయింట్లతో జోన్‌ 'బి' నుంచి 'ప్లే ఆఫ్‌'కు చేరింది. దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ (55 పాయింట్లు) పట్టికలో నాలుగో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలకమైన మ్యాచ్‌లో పటిష్టమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న యూపీ యోధ అలవోకగా గెలిచింది.

అయితే రిషాంక్‌ దేవడిగ (9), శ్రీకాంత్‌ జాదవ్‌ (6) సత్తాచాటడంతో యూపీ 19-11తో ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన యూపీ మరో మూడు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా 41-21తో తిరుగులేని ఆధిపత్యం సాధించింది. చివరి వరకు ఆధిపత్యాన్ని నిలుపుకొని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. బెంగాల్‌ తరఫున ఆదర్శ్‌ 4, జాంగ్‌ కున్‌ లీ 3 పాయింట్లు సాధించారు. నామమాత్రమైన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 40-32తో జైపూర్‌పింక్‌ పాంథర్స్‌పై గెలిచింది.

జోన్‌ 'ఎ' నుంచి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ (93 పాయింట్లు), యు ముంబా (86 పాయింట్లు), దబంగ్‌ ఢిల్లీ (68 పాయింట్లు) 'ప్లే ఆఫ్స్‌'కు చేరగా... జోన్‌ 'బి' నుంచి బెంగళూరు బుల్స్‌ (78 పాయింట్లు), బెంగాల్‌ వారియరర్స్‌ (69 పాయింట్లు), యూపీ యోధా (57 పాయింట్లు) నాకౌట్‌కు అర్హత సాధించాయి.

యూపీ విజయం సాధించడంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌కు నిరాశ తప్పలేదు. ఆ జట్టు ప్రస్థానం లీగ్‌ దశలోనే ముగిసింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 40-32తో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలిచింది. బెంగళూరు తరపున పవన్‌ షెరావత్‌ (16) అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. జైపుర్‌ జట్టులో దీపక్‌ (13) రాణించాడు. ఆదివారం కొచ్చిలో జరుగనున్న ఎలిమినేటర్‌-1లో యు ముంబాతో యూపీ యోధ... ఎలిమినేటర్‌-2లో దబంగ్‌ ఢిల్లీతో బెంగాల్‌ వారియర్స్‌ తలపడనున్నాయి.

Story first published: Friday, December 28, 2018, 10:32 [IST]
Other articles published on Dec 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+