Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టైటాన్స్‌కు మూడో సారి, జైపూర్‌పై యూ ముంబా విజయం

Pro Kabaddi 2018 : Bengal Warriors Beat Telugu Titans, Match Highlights | Oneindia Telugu
Pro Kabaddi 2018: Bengal Warriors beat Telugu Titans 30-25

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 25-30తో తెలుగు టైటాన్స్‌ ఓటమిపాలైంది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 8 పాయింట్లతో సత్తా చాటినా టైటాన్స్‌ను గెలిపించలేకపోయాడు. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న తెలుగు టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో ఓటమి మూటగట్టుకుంది.

జోన్‌ 'బి'లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 25-30తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. శుక్రవారం జరిగిన జోన్‌-బి మ్యాచ్‌లో టైటాన్స్‌ 25-30తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి బెంగాల్‌ దూకుడుగా ఆడింది. డిఫెండర్లు బల్‌దేవ్‌, సుర్జిత్‌ సింగ్‌ అద్భుతంగా రాణించి బెంగాల్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. మణీందర్‌సింగ్‌ డూ ఆర్‌ డై రైడ్‌లో రెండు పాయింట్లు తీసుకురావడంతో 12-7తో ఆధిక్యంలో నిలిచింది బెంగాల్‌.

అర్ధభాగం ముగిసే సమయానికి బెంగాల్‌ 13-11తో టైటాన్స్‌పై ఆధిక్యంలో నిలిచింది. అదే జోరులో టైటాన్‌ను ఆలౌట్‌ చేసి 20-13తో ఆధిక్యంలోకి వెళ్లిన బెంగాల్‌ .. ఆ తర్వాత బల్‌దేవ్‌ ట్యాక్లింగ్‌లో మెరవడంతో 30-25తో విజయాన్ని సాధించింది. రాహుల్‌ చౌదరి (8 రైడ్‌ పాయింట్లు) జట్టును గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జోన్‌-ఎ మ్యాచ్‌లో యు ముంబా 48-24తో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది.

అభిషేక్‌సింగ్‌ (10 రైడ్‌ పాయింట్లు), ఫజల్‌ అత్రాచలి (5 ట్యాకిల్‌) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో యు ముంబా 39 పాయింట్లతో జోన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో యు ముంబా 48-24తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలిచింది. శనివారం మ్యాచ్‌లలో పట్నా పైరేట్స్‌తో బెంగాల్‌ వారియర్స్, యు ముంబాతో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ తలపడనున్నాయి.

Story first published: Saturday, November 10, 2018, 10:04 [IST]
Other articles published on Nov 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+