హర్యానాకు టైటాన్స్ చెక్: ఐదో సీజన్‌లో నాలుగో విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. అటు రైడర్లు ఇటు డిఫెండర్లు సమష్టిగా సత్తా చాటడంతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 37-19తో హర్యానా స్టీలెర్స్‌పై విజయం సాధించింది.
ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు ఇది నాలుగో విజయం కావడం విశేషం. కెప్టెన్ రాహుల్ చౌదరి పది పాయింట్లు స్కోర్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచీ తెలుగు టైటాన్స్‌దే ఆధిపత్యం కావడం విశేషం. 20 సార్లు రైడింగ్‌కు వెళ్లిన రాహుల్ చౌదరి 10 పాయింట్లు తెచ్చాడు.

డిఫెండర్లు విశాల్ భరద్వాజ్ (6), సోంబీర్ (3)లు కెప్టెన్ రాహుల్ చౌదరికి అండగా నిలవడంతో ఈ సీజన్లో తమపై వరుస విజయాలు నమోదు చేసిన హర్యానాకు తెలుగు టైటాన్స్ చెక్ పెట్టింది. ఈ విజయంతో 13 మ్యాచ్‌ల ద్వారా 24 పాయింట్లు సాధించిన టైటాన్స్ జోన్ బీలో ఐదో స్థానంలో నిలిచింది.
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 24-20తో పుణేరి పల్టాన్‌పై విజయం సాధించింది. డిఫెన్స్‌లో గొప్పగా రాణించిన బెంగళూరు 15 టాకిల్ పాయింట్లు స్కోర్ చేసింది. బెంగళూరు జట్టులో కుల్దీప్ సింగ్ 5, సునీల్ జైపాల్, మహేందర్ సింగ్ చెరో 4 పాయింట్లు సాధించారు.
ఆరు వరుస ఓటముల తర్వాత బెంగళూరు బుల్స్‌కు ఇదే తొలి విజయం. జోన్ ఏలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పుణెరి (32) నాలుగో స్థానంలో, 12 మ్యాచ్‌ల్లో 41 పాయింట్లతో హర్యానా రెండో స్థానంలో ఉన్నాయి. బెంగళూరు 6 చేయగా పుణెరి 7 రైడ్ పాయింట్లు చేసింది. బుల్స్ 15, పల్టాన్ 11 ట్యాకిల్ పాయింట్లు చేసింది.
సోమవారం కబడ్డీ పోటీలకు సెలవు
ప్రో కబడ్డీలో మంగళవారం
బెంగాల్ వారియర్స్ Vs తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు)
దబాంగ్ ఢిల్లీ Vs హర్యానా స్టీలెర్స్ (రాత్రి 9 గంటలకు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications