ఒకే రైడ్‌లో 4 పాయింట్లు సాధించిన రాహుల్, విజయం టైటాన్స్‌దే
హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఐదోసీజన్‌లో వరుస ఓటములతో అభిమానులను నిరాశపరుస్తున్న తెలుగు టైటాన్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటింది. కెప్టెన్ రాహుల్ చౌదరి అద్భుత ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ 46-34 స్కోరు తేడాతో విజయం సాధించింది.
17 రైడింగ్ పాయింట్లతో కెప్టెన్ రాహుల్ చౌదరి తెలుగు టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. రైడింగ్‌లో టైటాన్స్ ఆటగాళ్లు 27 పాయింట్లు సాధించారు. ఇక, 11 ట్యాకిల్ పాయింట్లతో ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. హుల్ రాహుల్ ఒకే రైడ్‌లో 4 పాయింట్లు సాధించడంతో 11వ నిమిషంలోనే 15-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తొలి అర్ధభాగం ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 23-11
దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 23-11తో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో జైపూర్ అనూహ్యంగా పుంజుకుంది. ఒకనొక దశలో 25-31తో టైటాన్స్‌కు చేరువగా వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ రాహుల్ మరోసారి సత్తా చాటడంతో తెలుగు టైటాన్స్ పాయింట్లలో దూసుకెళ్లింది.

చివరి వరకు అదే ఊపు
చివరి వరకు అదే ఊపుని కొనసాగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జైపూర్ కెప్టెన్ జస్వీర్ సింగ్ ఒక్క రైడింగ్ పాయింట్ కూడా తీసుకురాలేకపోయాడు. మరోవైపు జైపూర్ ఆటగాడు పవన్ కుమార్ కూడా 17 పాయింట్లు సాధించినప్పటికీ అతడికి సహచరుల నుంచి ఏమాత్రం సహకారం అందలేదు.

జోన్-బిలో నాలుగో స్థానంలో
బుధవారం నాటి మ్యాచ్‌లో జైపూర్ స్టార్ ఆటగాళ్లు మన్‌జీత్ చిల్లర్, జస్వీర్ సింగ్ ఘోరంగా విఫలమయ్యారు. మన్‌జీత్ ఒక్క పాయింటే సాధించగా.. జస్వీత్ పాయింటే తేలేదు. ఐదో సీజన్‌లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 38 పాయింట్లతో జోన్-బిలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

మరో మ్యాచ్‌లో యూపీ యోధా విజయం
మరోవైపు జైపూర్ 13 మ్యాచ్‌ల్లో 38 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కాగా బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధా జట్టు 45-16 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీ జట్టును చిత్తుగా ఓడించింది. యూపీ స్టార్ రైడర్ నితిన్ తోమార్ 15 పాయింట్లు సాధించగా.. రిషాంక్ 5, సాగర్ 5 పాయింట్లతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications