Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో కబడ్డీ: యూపీ యోధపై తలైవాస్ సంచలన విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో బుధవారం నువ్వానేనా అన్నట్లు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ జట్టు 34-33తో యూపీ యోధపై సంచలన విజయం సాధించింది. ఈ సీజన్‌లో తలైవాస్‌కు ఇది రెండో విజయం మాత్రమే. వరుసగా ఓటమిలతో కుదేలైన తమిళ్ తలైవాస్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.

మ్యాచ్‌లో ఎక్కువ భాగం యూపీదే ఆధిపత్యమైనా, తలైవాస్‌ కీలక సమయాల్లో రాణించి విజయం సాధించింది. ఆట ముగిసేందుకు ఇక నిమిషమే మిగిలుంది. తమిళ్‌ తలైవాస్‌ 30-31 స్కోరుతో వెనుకబడింది. ఈ దశలో కూతకు వెళ్లిన అజయ్‌ ఠాకూర్‌ సూపర్‌ రైడ్‌తో ఆధిక్యం 33-31తో తారుమారైంది.

చివరి నిమిషంలో చెలరేగిన ఠాకూర్

చివరి నిమిషంలో చెలరేగిన ఠాకూర్

ఇంకొన్ని క్షణాల వ్యవధిలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో చివరకు తమిళ్‌ తలైవాస్‌ 34-33తో యూపీ యోధపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 12-18తో ఓటమి ఖాయమనుకున్న తలైవాస్‌ జట్టు రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుంది. హోరాహోరీగా సాగిన రెండో అర్ధభాగంలో అజయ్‌ ఠాకూర్‌ చక్కని ప్రదర్శన చేశాడు.

అజయ్‌ ఠాకూర్, ప్రపంజన్‌ చెరో 8 పాయింట్లు

అజయ్‌ ఠాకూర్, ప్రపంజన్‌ చెరో 8 పాయింట్లు

తమిళ్‌ తలైవాస్‌ తరుపున అజయ్‌ ఠాకూర్, ప్రపంజన్‌ చెరో 8 పాయింట్లు సాధించగా, టాకిల్‌లో అమిత్‌ హుడా 4, వినీత్‌ కుమార్‌ 3 పాయింట్లు చేశారు. యూపీ యోధ తరఫున రైడర్‌ నితిన్‌ తోమర్‌ అద్భుతంగా పోరాడాడు. 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన నితిన్‌ 14 పాయింట్లు తెచ్చాడు.

10 మ్యాచ్‌ల్లో 21 పాయింట్లతో ఆఖరి స్ధానంలో తలైవాస్

10 మ్యాచ్‌ల్లో 21 పాయింట్లతో ఆఖరి స్ధానంలో తలైవాస్

రిషాంక్‌ దేవడిగా 8 పాయింట్లు తీసుకురాగా, డిఫెండర్‌ నితీశ్‌ కుమార్‌ (5) టాకిల్‌లో రాణించాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గినా జోన్‌-బి పాయింట్ల పట్టికలో తమిళ్‌ తలైవాస్‌ 10 మ్యాచ్‌ల్లో 21 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో ఉంది. ఇక యూపీ యోధ 14 మ్యాచ్‌ల నుంచి 37 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

హర్యానా జోరుకు పల్టాన్ బ్రేక్

హర్యానా జోరుకు పల్టాన్ బ్రేక్

వరుస విజయాలతో జోరుమీదున్న హర్యానా స్టీలర్స్ జట్టుకు బ్రేక్ పడింది. పుణెరి పల్టాన్ జట్టు 38-22 తేడాతో హర్యానాపై ఘన విజయం సాధించింది. పుణేరి తరఫున దీపక్‌ హుడా 13, సందీప్‌ నర్వాల్‌ 8 పాయింట్లు చేయగా, రాజేశ్, మోను, రవి కుమార్, గిరీశ్‌ తలా 2 పాయింట్లు సాధించారు.

హర్యానాలో దీపక్ కుమార్ దహియా 11 రైడింగ్ పాయింట్లు సాధించినా, జట్టులో మిగిలిన ఆటగాళ్లంతా విఫలమవడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. మిగిలిన వారిలో వజీర్‌ సింగ్‌ 3, సురేందర్‌ నడా, మోహిత్‌ చిల్లర్, జీవ గోపాల్‌ తలా 2 పాయింట్లు చేశారు. దీంతో జోన్‌-ఏలో హర్యానా (46 పాయింట్లు) రెండో స్థానంలో, పుణెరి (37 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉన్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+