సూపర్ మ్యాచ్: గుజరాత్‌పై తమిళ్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో తమిళ్ తలైవాస్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో వరుస ఓటములతో నిరాశలో మునిగిన తమిళ్ తలైవాస్ గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను 35-34 తేడాతో ఓడించింది. మంగళవారం ఉత్కంఠగా సాగిన పోరులో ఆఖర్లో అజయ్ ఠాకూర్ విజృంభించాడు.

అజయ్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన
13 రైడ్ పాయింట్లతో జట్టుని గెలిపించాడు. మ్యాచ్ ముగిసే కొద్దీ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి రైడ్‌లో అజయ్ ఠాకూర్ రెండు పాయింట్లు రాబట్టడంతో తమిళ్ తలైవాస్ 35-34తో గుజరాత్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. గుజరాత్ 20 రైడింగ్, 9 ట్యాకిల్, 4 ఆలౌట్, 1 ఎక్స్‌ట్రా పాయింట్ నమోదు చేయగా, తమిళ్ తలైవాస్ జట్టు 25 రైడింగ్, 8 ట్యాకిల్, 2 ఆలౌట్ పాయింట్లతో అనూహ్య విజయాన్ని నమోదు చేసింది.

పట్నా పైరేట్స్ ఘన విజయం
సొంతగడ్డపై బోణీ కొట్టాలని ఆశించిన దబాంగ్ ఢిల్లీకి మళ్లీ నిరాశే. మంగళవారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఐదో సీజన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా ఓటమి కావడం విశేషం. మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి వెంటనే కోలుకున్న పట్నా పైరేట్స్ ఐదో సీజన్‌లో పదో విజయం సాధించింది.

పాట్నాకు గట్టి పోటీ ఇచ్చిన ఢిల్లీ
మంగళవారం ఇక్కడి త్యాగరాయ స్టేడియంలో జరిగిన ఇంటర్ జోన్ చాలెంజ్ మ్యాచ్‌లో పట్నా 36-34తో ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్ కూడా చివరివరకు హోరాహోరీగా సాగింది. ఆరంభంలో 12 పాయింట్ల వెనుకంజలో నిలిచినా అసాధారణంగా పుంజుకొని ఢిల్లీ గట్టి పోటీ ఇచ్చింది.

సూపర్ ఫామ్‌లో పర్దీప్ నర్వాల్
కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 14 పాయింట్లతో ఐదో సీజన్‌లో మరోసారి తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. చివరి నిమిషాల్లో ఒత్తిడిని తట్టుకుని నిలిచిన పట్నా పైరేట్స్ మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications