చివరి నిమిషంలో సూపర్ రైడ్‌తో వారియర్స్ విజయం
హైదరాబాద్: చివరి నిమిషంలో మణిందర్ సింగ్ సూపర్‌రైడ్ బెంగాల్ వారియర్స్‌ను విజయం వైపు నడిపించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం బెంగాల్ వారియర్స్ 33-29తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. ఆఖరి నిమిషాల్లో సూపర్ రైడ్‌తో వారియర్స్ విజయంలో మణిందర్ సింగ్ (9 పాయింట్లు) కీలక పాత్ర పోషించాడు.

రోహిత్, అజయ్ కుమార్ విఫలం
వారియర్స్‌ను గట్టెక్కించిన మణిందర్ సింగ్ 9 పాయింట్లతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీపక్ నర్వాల్ (7), కెప్టెన్ సుర్జీత్‌సింగ్ (6) బెంగాల్ జట్టులో సత్తా చాటారు. బెంగళూరు బుల్స్ డిఫెండర్లు రవీందర్ పాహల్, మహేందర్ సింగ్ చెరో ఐదేసి పాయింట్లతో మెరిశారు. కానీ రైడర్లు రోహిత్, అజయ్ కుమార్ విఫలమయ్యారు.

11 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్‌గా
బుల్స్ తరఫున రైడర్ హరీష్ నాయక్ అత్యధికంగా 11 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోన్-బిలో బెంగాల్ 17 మ్యాచ్‌ల నుంచి 58 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. బెంగళూరు 16 మ్యాచ్‌ల నుంచి 34 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

నాలుగో స్థానంలో బెంగళూరు
మరోవైపు 34 పాయింట్లతో బెంగళూరు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 34-29తో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. పుణెరి తరఫున దీపక్ హూడా (10 పాయింట్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోను (6), రెహ్మాన్ (5), గిరీష్ (5) రాణించారు.

మూడో స్థానంలో పుణెరి పల్టాన్
దబాంగ్ జట్టులో మెరాజ్ షేక్ ఏడు పాయింట్లు సాధించాడు. గ్రూప్-ఏలో పుణెరి 12 మ్యాచ్‌ల నుంచి 47 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరోవైపు 14 మ్యాచ్‌లు ఆడిన దబాంగ్ ఢిల్లీ (30 పాయింట్లు) అట్టడుగున ఆరో స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications