Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో కబడ్డీలో తొలిసారి: రెండు మ్యాచ్‌లు టైగా

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‍‌‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌లు టై గా ముగిశాయి. పాట్నా పైరేట్స్, హర్యానా స్టీలెర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 41-41తో డ్రాగా ముగియగా, ఆ తర్వాత గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌, యుపీ యోధా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా 30-30తో టైగా ముగిసింది.

దీంతో ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముందుగా డిఫెండింగ్ చాంపియన్ పాట్నా పైరేట్స్, హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన మ్యాచ్ 41-41తో డ్రా అయ్యింది. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ రైడింగ్‌లో 13 పాయింట్లతో ఆకట్టుకోగా, డిఫెన్స్‌లో విజయ్(4) రాణించాడు.

Pro Kabaddi 2017: Patna Pirates Hold Haryana Steelers to a Tie

ఈ మ్యాచ్‌లో తొలుత హర్యానా తొలి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ, రెండో అర్ధభాగంలో అనూహ్యంగా పుంజుకుంది. ఒకానొక సమయంలో పాట్నా పైరేట్స్ రైడర్లు విజృంభించడంతో 34-36తో ప్రత్యర్థికి సమీపంగా వచ్చింది. ఆఖరి నిమిషంలో వజీర్‌ రెండు రైడ్‌ పాయింట్లు సాధించడంతో పట్నా 41-41తో స్కోరు సమం చేసింది.

గుజరాత్‌, యూపీ మ్యాచ్‌ టై:
శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్ కూడా టైగానే ముగిసింది. ఆరంభం నుంచే గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌, యూపీ యోధ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీ సాగింది. అయితే పదకొండో నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన యూపీ 13-5తో ఆధిక్యంలో నిలిచింది. కానీ తొలి అర్ధభాగం పూర్తయ్యే నాటికి గుజరాత్‌ (16-18) పుంజుకుంది.

చివరి నిమిషం వరకు రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. చివర్లో నితిన్‌ తోమర్‌ రెండు రైడ్‌ పాయింట్లు సాధించడంతో యూపీ 27-28తో నిలిచింది. అయితే చివర్లో యూపీ జట్టు పాయింట్ సాధించడంతో 30-30తో మ్యాచ్‌ను టై చేసింది. యూపీలో నితిన్‌ తోమర్‌ 7, గుజరాత్‌లో సుకేశ్‌ హెగ్డే 5 రైడ్‌ పాయింట్లు చేశారు.

ప్రొ కబడ్డీలో శనివారం:
పట్నా × యు ముంబా (రాత్రి 8 గంటలకు)
హర్యానా × బెంగళూరు (రాత్రి 9 గంటలకు)
స్టార్‌ స్పోర్ట్స్‌ 2లో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+