Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి వరకు ఉత్కంఠ: ఒక్క పాయింట్‌ తేడాతో యుపి ఓటమి

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు 32-31 తేడాతో యూపీ యోధా జట్టును ఓడించింది. దీంతో సొంతగడ్డపై యోధాకు మరో ఓటమి. రైడర్‌ దీపక్‌ నర్వాల్‌ (10), జాంగ్‌ కున్‌ లీ (4) వారియర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఆట ప్రారంభం నుంచి రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు ఆడాయి. చెరో పాయింటు సాధిస్తూ ముందుకెళ్లాయి. దీంతో తొలి అర్ధభాగంలో బెంగాల్‌ వారియర్స్ 19-14తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో యుపి జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఒకానొక దశలో స్కోరుని సమీపించింది కూడా.

 Pro Kabaddi 2017 Highlights: Bengal Warriors register one-point win over UP

25-25తో స్కోరు సమం కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆట ముగిసేందుకు ఐదే నిమిషాలున్న సమయంలో దీపక్‌ మూడు రైడ్‌ పాయింట్లు సాధించడంతో బెంగాల్‌ మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో యుపి యోధా ఆటగాళ్లు పాయింట్లు సాధించేందుకు గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

చివర్లో వారియర్స్‌కు ఆధిక్యం లభించింది. దీంతో ఒక్క పాయింట్‌తో యుపి యోధాపై బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. యుపి రైడర్‌ దీపక్‌ నర్వాల్‌ (10) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ నితిన్‌ తోమర్‌ (8), రిషాంక్‌ దేవాడిగ (7) రాణించినా యోధాను గెలిపించలేకపోయారు.

ప్రొ కబడ్డీలో బుధవారం
హర్యానా స్టీలెర్స్ Vs దబాంగ్ ఢిల్లీ రాత్రి 8 నుంచి
యుపి యోధా Vs తమిళ్ తలైవాస్ రాత్రి 9 నుంచి
ప్రసారం స్టార్‌ స్పోర్ట్స్‌-2లో
వేదిక: లక్నో

Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+