దూసుకుపోతున్న గుజరాత్: జైపూర్‌పై ఘన విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా సొంతగడ్డపై గుజరాత్ జట్టు ఎదురు లేకుండా దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 27-20తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది.
గుజరాత్ తరఫున సచిన్ 7 పాయింట్లు సాధించగా, మిఘని, ఫజెల్ చెరో నాలుగు పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేశారు. రైడింగ్‌లో రెండు జట్లు ఎనిమిదేసి పాయింట్లు సాధించాయి. బలమైన డిఫెన్స్ ఉన్న గుజరాత్ 13 ట్యాకిల్ పాయింట్లు, 2 ఆలౌట్ పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది.

సోమవారం లీగ్‌కు విశ్రాంతి దినం. ఎలాంటి మ్యాచ్‌లు జరగవు. మంగళవారం జరిగే పోటీల్లో బెంగాల్ వారియర్స్‌తో పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:18 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications