Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముగిసిన వేలం.. తెలుగు టైటాన్స్‌ జట్టు ఇదే

PKL 2019 Auction Highlights : Telugu Titans Gets Siddharth Desai For 1.45 Crore || Oneindia Telugu
PKL Auction highlights: Telugu Titans gets Siddharth Desai for 1.45 crore, Rahul Chaudhari to Tamil Thalaivas for 94 lakh

మన దేశంలో ఐపీఎల్ లీగ్ అనంతరం అంతటి ప్రాచుర్యం పొందిన మరో లీగ్‌ ప్రొ కబడ్డీ. విజయవంతంగా ఆరు సీజన్‌లను పూర్తి చేసుకున్న ప్రొ కబడ్డీ.. ఏడో సీజన్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏడో సీజన్‌కు సంబంధించిన వేలం మంగళవారం ముగిసింది.

12 ఫ్రాంచైజీలు.. 200 మంది ఆటగాళ్లు:

12 ఫ్రాంచైజీలు.. 200 మంది ఆటగాళ్లు:

రెండు రోజుల పాటు సాగిన ఈ వేలంలో 12 ఫ్రాంచైజీలు మొత్తం 200 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 173 మంది భారత ఆటగాళ్లు, 27 మంది విదేశీయులు ఉన్నారు. వీరికోసం ఫ్రాంచైజీలు మొత్తం రూ. 50 కోట్లు ఖర్చు చేశాయి. సీజన్‌-7 జూలై 1 నుంచి అక్టోబర్‌ 9 వరకు జరుగుతుంది.

టైటాన్స్‌కు సిద్ధార్థ్‌ దేశాయ్‌:

టైటాన్స్‌కు సిద్ధార్థ్‌ దేశాయ్‌:

సోమవారం జరిగిన ప్రధాన వేలంలో రూ. 1.45 కోట్లకు సిద్ధార్థ్‌ దేశాయ్‌ను.. రెండో రోజు 'ఎ' కేటగిరీ డిఫెండర్స్‌ విభాగంలో విశాల్‌ భరద్వాజ్‌ను రూ.60 లక్షలకు తెలుగు టైటాన్స్‌ సొంతం చేసుకుంది. స్టార్ రైడర్ నితిన్‌ తోమర్‌ను (రూ.1.20 కోట్లు) పుణేరి పల్టాన్స్ కొనుక్కుంది.

తలైవాస్ కు రాహుల్ చౌదరి:

తలైవాస్ కు రాహుల్ చౌదరి:

తెలుగు టైటాన్స్‌ స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరిని (94 లక్షలు) తమిళ్ తలైవాస్ ఎంపిక చేసుకుంది. సందీప్‌ నర్వాల్‌ను (రూ. 89 లక్షలు) యు ముంబా దక్కించుకుంది. డిఫెండర్‌ మహేందర్‌ సింగ్ ను (రూ. 80 లక్షలకు) బెంగళూరు బుల్స్‌.. మన్‌జీత్‌ను (రూ. 63 లక్షలకు) పుణేరీ పల్టన్‌ సొంతం చేసుకున్నాయి.

తెలుగు టైటాన్స్‌ జట్టు ఇదే:

సిద్ధార్థ్‌ దేశాయ్, సూరజ్‌ దేశాయ్, రాకేశ్‌ గౌడ, విశాల్‌ భరద్వాజ్, కృష్ణ మదన్, సి అరుణ్, అబోజర్‌ మిగాని, అర్మాన్, డ్యూయెట్‌ జెన్నింగ్స్, ఫర్హద్‌ రహీమి, శివగణేశ్‌ రెడ్డి, మనీశ్, ఆకాశ్‌ చౌదరి, అమిత్‌ కుమార్‌.

Story first published: Wednesday, April 10, 2019, 17:24 [IST]
Other articles published on Apr 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+