గుజరాత్‌ చేతిలో చిత్తుగా ఓడిన తలైవాస్‌.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఔట్!!

పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తమిళ్‌ తలైవాస్‌ తప్పుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్‌ 50-21తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో తలైవాస్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. గుజరాత్‌ రైడర్‌ సోను (15 పాయింట్లు), రోహిత్ గులియా (11 పాయింట్లు) సూపర్-10లతో సత్తా చాటితే.. ట్యాక్లింగ్‌లో పర్వేశ్ (5 పాయింట్లు) హైఫై సాధించాడు. తలైవాస్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 16 రైడ్లలో కేవలం 4 పాయింట్లు మాత్రమే చేసి పూర్తిగా విఫలమయ్యాడు. మరో సీనియర్ ప్లేయర్ అజయ్ ఠాకూర్ అందుబాటులో లేకపోవడంతో తలైవాస్‌కు ఓటమి తప్పలేదు.

కొరియా ఓపెన్‌లో ముగిసిన భారత పోరాటం: సెమీస్‌లో కశ్యప్‌ ఓటమికొరియా ఓపెన్‌లో ముగిసిన భారత పోరాటం: సెమీస్‌లో కశ్యప్‌ ఓటమి

మ్యాచ్ ఆరంభంమైన తొలి ఐదు నిమిషాలు తలైవాస్‌ మంచి ఆటను కనబరిచింది. అనంతరం తలైవాస్ స్వయం తప్పిదాలు చేస్తూ.. వెనుకబడిపోయింది. పుంజుకున్న గుజరాత్..10 నిమిషాల్లోపే తలైవాస్‌ను ఆలౌట్ చేసి 11-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం కూడా అదే ఊపు కొనసాగిస్తూ.. 20-9తో తొలి అర్ధ భాగంను ముగించింది. విరామంఅనంతరం తలైవాస్‌ను మరోసారి ఆలౌట్ చేసిన గుజరాత్ 28-11తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇక అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వెళ్లిన గుజరాత్.. అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

గుజరాత్ రైడింగ్‌లో 27 పాయింట్లు సాధిస్తే.. తలైవాస్ 13 మాత్రమే సాధించింది. ట్యాక్లింగ్‌లో గుజరాత్‌కు16 పాయింట్లు దక్కితే.. తలైవాస్‌కు కేవలం 7 పాయింట్లే వచ్చాయి. దీనికి తోడు తలైవాస్‌ కోర్టు మూడు సార్లు ఖాళీ కావడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. రాహుల్‌ చౌదరి పూర్తిగా నిరాశ పరిచాడు. తలైవాస్‌ 13 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

ప్రొ కబడ్డీ లీగ్‌-7లో యూపీ యోధా జట్టు పేఆఫ్స్‌కు చేరువైంది. శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ 37- 30తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. యోధా రైడర్‌ శ్రీకాంత్‌ జాదవ్‌ 11 పాయింట్లతో రాణించగా.. నితీష్‌ కుమార్‌ 7 టాకిలింగ్స్‌ చేశాడు. మరో మ్యాచ్‌ నెగ్గితే యుపీకి పేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. నేటి మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో దబంగ్‌ ఢిల్లీ; గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 29, 2019, 10:02 [IST]
Other articles published on Sep 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X