Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

36 పాయింట్లతో చెలరేగిన పర్‌దీప్ నర్వాల్‌.. బెంగాల్‌పై పైరేట్స్‌ విజయం

PKL 7: Pardeep Narwal scores 34 in Patna Pirates big win over Bengal Warriors

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్స్‌ రైడర్‌ 'డుబ్కీ కింగ్‌' పర్‌దీప్ నర్వాల్‌ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడి ఏకంగా 34 పాయింట్లు సాధించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ తన ఆఖరి మ్యాచ్‌లో 69-41తో బెంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసింది. పర్దీప్ జంగ్‌కున్‌ లీ, ట్యాక్లింగ్‌లో నీరజ్‌ కుమార్‌ హైఫైలతో అదరగొట్టడంతో పాట్నా సునాయాస విజయాన్ని అందుకుంది. బెంగాల్‌ జట్టులో రైడర్‌ సౌరభ్‌ పాటిల్‌ (11పాయింట్లు), రాకేశ్‌ (10 పాయింట్లు) సూపర్‌-10లు సాధించాడు.

మ్యాచ్‌ ఆరంభంలో కాసేపు వారియర్స్‌ ముందంజలో ఉన్నా.. ఆ తర్వాత పర్‌దీప్ నర్వాల్‌ రెచ్చిపోవడంతో అసలు కోలుకోలేకపోయింది. పర్‌దీప్ దూకుడు ముందు బెంగాల్‌ ఆటగాళ్లు నిలవలేకపోయారు. ప్రతిసారి రైడ్ పాయింట్ తెస్తూ.. పర్‌దీప్ చెలరేగిపోయాడు. ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన పర్‌దీప్.. ఏకంగా ఆరుగురిని ఔట్‌ చేసి రైడింగ్‌లో తనకు ఎదురులేదని చాటాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ నాలుగు సార్లు ఆలౌట్‌ అయింది.

ఈ సీజన్‌లో 300 పాయింట్ల మార్కును అందుకున్న రెండో రైడర్‌గా పర్‌దీప్ (304 పాయింట్లు) నిలిచాడు. బెంగళూరు రైడర్‌ పవన్‌ షెరావత్‌ 309 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధ 43-39తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్‌.. తమిళ్‌ తలైవాస్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడతాయి.

బెంగళూరు తరఫున రైడర్ పవన్‌ షెరావత్‌ పీకేఎల్ చరిత్రలో రికార్డు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పవన్ 39 పాయింట్లు సాధించి పీకేఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు పర్‌దీప్ నర్వాల్ (33) పాయింట్లు సాధించాడు. గతంలో 33 పాయింట్లు చేసిన పర్‌దీప్.. ఈసారి 34 పాయింట్లు చేసాడు.

Story first published: Monday, October 7, 2019, 8:51 [IST]
Other articles published on Oct 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+