PKL 2025: తెలుగు టైటాన్స్ ఔట్.. ఫైనల్ సమరం సిద్ధం!
PKL 2025: ప్రో కబడ్డీ లీగ్(PKL)-2025లో తెలుగు టైటాన్స్ జట్టు ప్రయాణం క్వాలిఫయర్-2తో ముగిసింది. బుధవారం(అక్టోబర్ 29) ఢిల్లీ వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పుణేరి పల్టన్‌తో తలపడింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తెలుగు టైటాన్స్ 50-45 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో తెలుగు టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది . మ్యాచ్ ఆరంభంలో తెలుగు టైటాన్స్ ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. ఆట చివరి ఘట్టంలో చేసిన అనవసరపు తప్పిదాలు జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాయి.
భరత్ హుడా అద్భుత ప్రదర్శన వృథా
ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఆల్‌రౌండర్ భరత్ హుడా వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భరత్ హుడా ఏకంగా 23 రైడ్ పాయింట్లు సాధించి మెరిశాడు. అయితే భరత్ హుడా ఈ పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఎందుకంటే మిగతా రైడర్ల నుంచి అతనికి పెద్దగా సహకారం లభించలేదు. మరోవైపు తెలుగు టైటాన్స్ డిఫెండర్లు కూడా పుణేరి పల్టన్ రైడర్లను అడ్డుకోవడంలో, టాకిల్ చేయడంలో విఫలమయ్యారు. పుణేరి పల్టన్ తరఫున ఆదిత్య షిండే అత్యుత్తమంగా రాణించి 22 పాయింట్లు సాధించాడు.ఇది వారి విజయానికి కీలకంగా మారింది.

పీకేఎల్ 2025 ఫైనల్ పోరు
తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించడం ద్వారా పుణేరి పల్టన్ జట్టు ప్రో కబడ్డీ లీగ్ 2025 ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్ పోరు శుక్రవారం జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ జట్లు కబడ్డీ సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏది ప్రో కబడ్డీ లీగ్ 2025 ఛాంపియన్‌గా నిలుస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications