Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2024: ఉత్కంఠ పోరులో పింక్ పాంథర్స్ విజయం

ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11 ఆసక్తికరంగా సాగుతోంది. జైపుర్ పింక్ పాంథర్స్ తమ జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. నొయిడా వేదికగా ఆదివారం పుణెరి పల్టాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 30-28 తేడాతో గెలిచింది. పుణెరిని వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో హర్యానా, జైపుర్, పుణెరి పల్టాన్ టాప్-3లో ఉన్నాయి.

మ్యాచ్ ఆరంభం నుంచి జైపుర్ పింక్ పాంథర్స్ పైచేయి సాధించింది. తొలి అర్ధభాగంలో పుణెరి పల్టాన్‌ను ఒక్కసారి ఆలౌట్ చేసి 19-12తో ఆధిక్యంలో నిలిచింది. రైడింగ్, ట్యాకిల్‌తో సత్తాచాటింది. అయితే సెకండ్ హాఫ్‌లో అదే జోరును కొనసాగించలేకపోయింది. ప్రత్యర్థి ముందు నిలవలేక ఒక్కసారి ఆలౌట్ అయ్యింది. కానీ ఫస్ట్ హాఫ్‌లోని ఆధిక్యంతో విజయతీరాలకు చేరింది.

PKL 2024 Jaipur Pink Panthers Edge Past Puneri Paltan in Thrilling 30-28 Victory

జైపుర్ పింక్ పాంథర్స్‌లో అర్జున్ దేశ్‌వాల్ 8 పాయింట్లు, అంకుశ్ 6 పాయింట్లతో సత్తాచాటారు. పుణెరి పల్టాన్ జట్టులో ఆకాశ్ 7 పాయింట్లతో పోరాడాడు. కాగా, నొయిడా వేదికగా ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో 36-29 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో సత్తాచాటినప్పటికీ టేబుల్ టాపర్ ముందు తమిళ్ తలైవాస్ నిలవలేకపోయింది.

ఫస్ట్ హాఫ్‌లో తమిళ్ తలైవాస్ 17-14తో హర్యానాపై ఆధిక్యం సాధించింది. ప్రత్యర్థి జట్టును ఒక్కసారి ఆలౌట్ చేసింది. కానీ సెకండ్‌ హాఫ్‌లో దారుణంగా విఫలమైంది. రైడింగ్, ట్యాకిల్‌లో పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్లు సమర్పించుకుంది. హర్యానా జట్టులో వినయ్ 10, మహ్మద్‌రీజా 8 పాయింట్లతో సత్తాచాటారు. తమిళ్ తలైవాస్ జట్టులో మొయిన్ 7 పాయింట్లతో పోరాడాడు. కాగా, సోమవారం రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్, రాత్రి 9 గంటలకు బెంగళూరు బుల్స్‌తో యు ముంబా తలపడనుంది.

Story first published: Sunday, November 17, 2024, 22:40 [IST]
Other articles published on Nov 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+