ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్- 11లో తమిళ్ తలైవాస్ సత్తాచాటుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 44-25తో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న పుణెరి పల్టాన్ కూడా 19 పాయింట్లు సాధించినప్పటికీ, పుణెరి కంటే తలైవాస్ ప్రత్యర్థి జట్లపై అత్యధిక పాయింట్ల ఆధిక్యంతో గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.
మ్యాచ్ ఆరంభం నుంచే తమిళ్ తలైవాస్ దూకుడుగా పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి గుజరాత్ జెయింట్స్‌పై 18-14తో ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్‌లో తలైవాస్ ప్లేయర్లు మరింత చెలరేగారు. ప్రత్యర్థి జట్టును రెండు సార్లు ఆలౌట్ చేశారు. ట్యాకిల్‌లో విజృంభించారు. రెండో అర్ధభాగంలో తమిళ్ తలైవాస్ 26-11తో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

తమిళ్ తలైవాస్ జట్టులో రైడర్ నరేందర్ కండోలా 15 పాయింట్లతో సత్తాచాటాడు. కెప్టెన్ సాహిల్, సచిన్ చెరో అయిదు పాయింట్లు సాధించారు. గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లలో గుమాన్ సింగ్ (7 పాయింట్లు) టాప్ స్కోరర్. బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై హర్యానా స్టీలర్స్ 30-28తో విజయం సాధించింది. ఈ సీజన్‌లో యూపీకి మూడో విజయం.
ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి యూపీ 9-11తో వెనుకంజలో ఉంది. కానీ రెండో అర్ధభాగంలో పుంజుకుంది. హర్యానా జట్టును ఒకసారి ఆలౌట్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యూపీ యోధాస్ విజయంలో గగన్ 9 పాయింట్లు, భరత్ 5 పాయింట్లతో కీలక పాత్ర పోషించారు. హర్యానా స్టీలర్స్ టీమ్‌లో వినయ్ 8 పాయింట్లు, సంజయ్ 6 పాయింట్లతో పోరాడారు. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు పట్నా పైరేట్స్‌తో దబాంగ్ ఢిల్లీ, రాత్రి 9 గంటలకు యూ ముంబాతో జైపుర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి.