ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ మరో ఓటమి చవిచూసింది. పుణె వేదికగా సోమవారం హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46-25 పాయింట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో నొయిడా వేదికగా అంతకుముందు తలపడిన మ్యాచ్‌లో హర్యానాను చిత్తు చేసిన టైటాన్స్.. నిన్నటి మ్యాచ్‌లో సత్తాచాటలేకపోయింది. 21 పాయింట్ల తేడాతో ఓటమిపాలై ఆరో స్థానానికి పడిపోయింది.
ఈ సీజన్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 10 విజయాలు, 8 ఓటములు చవిచూసింది. మరోవైపు హర్యానా 14 విజయాలు, 4 పరాజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. కాగా, మ్యాచ్ ఆరంభం నుంచి హర్యానా పాయింట్ల వేట కొనసాగించింది. తొలి అర్ధభాగంలో టైటాన్స్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఫస్టాఫ్‌ను 28-9 భారీ తేడాతో ముగించింది. రెండో అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ పుంజుకుంది. ప్రత్యర్థిని ప్రతిఘటించి ఓటమి అంతరాన్ని తగ్గించుకుంది.

హర్యానా స్టీలర్స్ జట్టులో శివమ్ పటారే 12, వినయ్ 7 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్ జట్టులో అశిష్ 13 పాయింట్లతో పోరాడాడు. పుణె వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌పై దబాంగ్ ఢిల్లీ 26-30 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తొలి అర్ధభాగంలో 10-12తో ఢిల్లీ ఆధిక్యంలో నిలిచింది. అదే జోరును సెకండ్ హాఫ్‌లోనూ ప్రదర్శించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
పుణెరి జట్టులో మెహిత్ (7) టాప్ స్కోరర్. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 13 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో దబాంగ్ ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు 18 మ్యాచ్‌ల్లో పుణెరి ఏడు విజయాలతో ఏడో స్థానంలో ఉంది. కాగా, ఇవాళ పుణె వేదికగానే రాత్రి 8 గంటలకు గుజరాత్ జెయింట్స్‌తో జైపుర్ పింక్ పాంథర్స్, రాత్రి 9 గంటలకు బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.