ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో హర్యానా స్టీలర్స్ సత్తాచాటుతోంది. పుణె వేదికగా శుక్రవారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42-36 తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన హర్యానాకు ఇది 13వ విజయం. 67 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. మరోవైపు 16 మ్యాచ్‌లు ఆడిన పట్నా పైరేట్స్ 9 విజయాలు, 6 ఓటములతో మూడో స్థానంలో నిలిచింది.
తొలి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా సాగుతున్నాయి. హర్యానాపై పట్నా పైరేట్స్ 17-16తో ఒక్క పాయింటు ఆధిక్యంలో నిలిచింది. హర్యానాను ఒక్కసారి ఆలౌట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్‌లో హర్యానా విజృంభించింది. పట్నాను ఏకంగా రెండు సార్లు కుప్పకూల్చింది. హర్యానా జోరు ముందు పట్నా నిలవలేకపోయింది. హర్యానా స్టీలర్స్‌లో శివమ్ 11, మహ్మద్ రీజా 9 పాయింట్లతో సత్తాచాటారు. పట్నా పైరేట్స్‌లో దేవాంక్ 13 పాయింట్లతో పోరాడాడు.

పుణె వేదికగా శుక్రవారం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై తమిళ్ తలైవాస్ 40-27 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన తలైవాస్‌కు ఆరో విజయం. టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ 4 విజయాలు, 10 ఓటములతో 11వ స్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచి తమిళ్ తలైవాస్ పాయింట్లతో హోరెత్తించింది.
తొలి అర్ధభాగంలో 19-8 పాయింట్లతో భారీ ఆధిక్యంలో నిలిచింది. గుజరాత్‌ను ఒక్కసారి ఆలౌట్ చేసింది. అయితే సెకండ్ హాఫ్‌లో గుజరాత్ గొప్పగా పుంజుకుంది. కానీ జెయింట్స్ చేసిన పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్లు చెరోసారి ఆలౌటయ్యాయి. తమిళ్ తలైవాస్‌లో మొయిన్ 13 పాయింట్లు సాధించాడు. గుజరాత్‌లో హిమాన్షు 11 పాయింట్లతో పోరాడాడు. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు యూపీ యోధాస్‌తో పుణెరి పల్టాన్, రాత్రి 9 గంటలకు బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.